BREAKING
thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు
Date of Publish : 27 March 2026, 11:22 am
Posted by : కూనురు మధు

పెట్రోల్, డీజిల్ ధరలపై భారీ ఉపశమనం

జాతీయం జాతీయం
27 Mar, 2026 - 11:22 AM
356 వీక్షణలు

​పెట్రోల్, డీజిల్ ధరలపై భారీ ఉపశమనం 

​కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్‌పై విధిస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని గణనీయంగా తగ్గించనుంది. దీనివల్ల సామాన్యులకు మరియు వాహనదారులకు పెద్ద ఊరట లభించనుంది. లీటర్ పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని 10 పది రూపాయలు తగ్గించారు. గతంలో ఉన్న రూ. 13 సుంకాన్ని ఇప్పుడు 3 రూపాయలకు కుదించారు. ​ డీజిల్ పై ఉన్న 10 రూపాయల ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం పూర్తిగా రద్దు చేసింది ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి గల ముఖ్య కారణం అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడిచమురు ధరల ప్రభావం సామాన్యులపై పడకుండా ఉండాలని, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల పైనే కొనసాగుతున్నాయి. ఈ ప్రభావం దేశీయ ధరలపై పడకుండా ఉండేందుకు కేంద్రం ఈ ముందస్తు చర్య తీసుకుంది.  ముడిచమురు ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా పెట్రోల్ ధరలను పెంచకుండా స్థిరంగా ఉంచడం వల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి.  ఈ సుంకం తగ్గింపు వల్ల ఆ కంపెనీలకు ఆర్థికంగా కొంత ఉపశమనం లభిస్తుంది. ఎక్సైజ్ సుంకం తగ్గించినప్పటికీ పెరిగిన అంతర్జాతీయ ధరల సర్దుబాటు వల్ల బంకుల్లో రేట్లు వెంటనే భారీగా తగ్గకపోవచ్చు, కానీ ధరలు మరింత పెరగకుండా అడ్డుకునేందుకు ఇది దోహదపడుతుంది.  ఈ నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ. 1.7 లక్షల కోట్ల వరకు రాబడి తగ్గవచ్చని అంచనా. ​విమాన ఇంధనం పై కూడా: విమాన ప్రయాణికులకు ఊరటనిస్తూ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ పై కూడా ప్రభుత్వం కొన్ని పన్ను మినహాయింపులు ప్రకటించింది.