BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 01 June 2026, 08:49 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై సీపీఐ ఆధ్వర్యంలో రోడ్డు నిర్బంధన ధర్నా

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jun, 2026 - 08:49 PM
138 వీక్షణలు

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై సీపీఐ ఆధ్వర్యంలో రోడ్డు నిర్బంధన ధర్నా

తాడిపత్రి : తాడిపత్రి నియోజకవర్గంలోని నంద్యాల రోడ్డులో రంగప్ప కాలనీ సమీపంలో సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో రోడ్డు నిర్బంధన ధర్నా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టి. రంగయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరలను పెంచి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం మోపుతోందని విమర్శించారు. ఎన్నికల ముందు ధరలు పెంచబోమని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ప్రజలకు వాహనాల వినియోగం తగ్గించి డబ్బు పొదుపు చేసుకోవాలని చెప్పడం మోసపూరిత వైఖరికి నిదర్శనమని అన్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఓటు అనే ఆయుధంతో తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. దేశ ప్రజలందరినీ ఏకం చేసి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తుందని, తదుపరి ఎన్నికల్లో ప్రజల తీర్పుతో ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం ఖాయమని హెచ్చరించారు.

ఈ ధర్నాలో సీపీఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్, మండల కార్యదర్శి నాగ రంగయ్య, చేతివృత్తుల సంఘం నాయకులు సాలెమల సూరి, శీను, నారాయణరెడ్డి, బాల నాయుడు, బాలు, రమణ, మహిళా నాయకులు లక్ష్మీదేవి, రామలచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.