BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 16 May 2026, 08:13 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పెట్రోల్ ధరల పెంపుతో సామాన్యుల్లో ఆందోళన

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
16 May, 2026 - 08:13 AM
139 వీక్షణలు

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. రామసముద్రంలో నిన్నటి వరకు రూ.110.13గా ఉన్న పెట్రోల్ ధర శుక్రవారం నాటికి రూ.113.41కు చేరగా, డీజిల్ ధర కూడా గణనీయంగా పెరిగింది. ఉదయం నుంచే కొత్త ధరలు అమల్లోకి రావడంతో వాహనదారులు, రైతులు, ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంధన ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నేత రెడ్డిసాహెబ్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పెట్రోలు, డీజిల్ ధరల పెంపుతో కేంద్ర ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాల వల్ల సామాన్య ప్రజలపై మోయలేని భారం పడుతోందన్నారు. “చమురు వినియోగం తగ్గించాలంటూ ప్రజలకు ఉపదేశాలు చేస్తూనే, మరోవైపు ధరలను పెంచడం ఎంతవరకు సమంజసం?” అని ప్రధాని మోదీని ప్రశ్నించారు. వెంటనే ధరల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించి ప్రజలకు ఊరట కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.