BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 24 March 2026, 08:41 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పల్లెరమూడిలో పల్లె నిద్ర కార్యక్రమం…

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Mar, 2026 - 08:41 AM
203 వీక్షణలు

పల్లెరమూడిలో పల్లె నిద్ర కార్యక్రమం… సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన పోలీసులు

నూజివీడు: నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్లెరమూడి గ్రామంలో ఎస్ఐలు జ్యోతి బాస్, లక్ష్మణ్ బాబు మరియు పోలీసు సిబ్బంది “పల్లె నిద్ర” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి, రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.

బ్యాంక్ పేరుతో వచ్చే నకిలీ మెసేజ్‌లు, లింకులను నమ్మవద్దని, OTPలు, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు. బహుమతులు, లాటరీల పేరుతో జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజ్‌లు వచ్చిన వెంటనే 1930కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

అత్యవసర పరిస్థితుల్లో 112కు కాల్ చేస్తే తక్షణ సహాయం అందుతుందని చెప్పారు. గ్రామంలో కొత్తగా వచ్చే వ్యక్తుల వివరాలను పోలీసులకు తెలియజేయడం ద్వారా దొంగతనాలను నివారించవచ్చని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పించారు.

అలాగే గ్రామ సమస్యలను పరస్పరం చర్చించుకుని పరిష్కరించుకోవాలని, అవసరమైతే పోలీసులను సంప్రదించాలని గ్రామస్తులకు సూచించారు.