BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 19 May 2026, 05:36 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పంచాయతీరాజ్ శాఖలో పారదర్శకతకు ప్రత్యేక పబ్లిక్ డ్యాష్‌బోర్డ్

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 May, 2026 - 05:36 PM
172 వీక్షణలు

పంచాయతీరాజ్ శాఖలో పారదర్శకతకు ప్రత్యేక పబ్లిక్ డ్యాష్‌బోర్డ్ : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ పనితీరులో మరింత పారదర్శకత తీసుకురావడానికి ప్రత్యేక పబ్లిక్ డ్యాష్‌బోర్డ్ ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు శాఖ కార్యకలాపాలు, అభివృద్ధి పనుల పురోగతి స్పష్టంగా కనిపించేలా వ్యవస్థ రూపొందించాలని సూచించారు.

స్వచ్ఛ రథం నమూనాలో గ్రీన్ షాప్స్‌ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి పరిశుభ్రతపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని తెలిపారు. గ్రామాల్లో వ్యర్థాల నిర్వహణను సమర్థంగా అమలు చేసి శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

అలాగే గ్రామీణ రోడ్ల నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తి కావాలని అధికారులకు స్పష్టం చేశారు. పనుల్లో ఆలస్యం లేకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని పేర్కొన్నారు.

పంచాయతీరాజ్ శాఖ సమీక్ష సమావేశంలో స్వర్ణ పంచాయతీ పోర్టల్, స్వమిత్వ కార్యక్రమం, గ్రామీణ రోడ్ల పురోగతి, ఘన వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.