BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 15 May 2026, 05:02 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పోలీస్ శాఖలో విషాదం

ఆంధ్రప్రదేశ్
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
15 May, 2026 - 05:02 PM
132 వీక్షణలు

పోలీస్ శాఖలో విషాదం: ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రంగారావు కన్నుమూత..

అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు.. అశ్రునయనాలతో తుది వీడ్కోలు..

మదనపల్లి, అన్నమయ్య జిల్లా పోలీస్ యంత్రాంగంలో తీవ్ర విషాదం నెలకొంది. జిల్లా ఏఆర్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న ఎం. రంగారావు (52 సంవత్సరాలు) అనారోగ్యంతో గురువారం రాత్రి కర్నూలులో కన్నుమూశారు. విధి నిర్వహణలో నిబద్ధత గల హెడ్ కానిస్టేబుల్ గా పేరు తెచ్చుకున్న ఆయన అకాల మరణం పట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

కర్నూలులో అంతిమ యాత్ర..

కర్నూలు నగరంలోని సీతారాం నగర్ నివాసంలో ఉంచిన రంగారావు పార్థివ దేహాన్ని జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎం. రవికుమార్ సందర్శించారు. పోలీస్ శాఖ తరపున పూలమాలలు వేసి నివాళులర్పించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక స్మశానవాటికలో పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. కర్నూలు రిజర్వ్ పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి గన్ సెల్యూట్తో అధికారిక లాంఛనాలతో అంజలి ఘటించారు.

కుటుంబానికి అండగా ఉంటాం: జిల్లా ఎస్పీ

"రంగారావు మరణం పోలీస్ శాఖకు తీరని లోటు. వారి కుటుంబానికి పోలీసు శాఖ అన్ని విధాలా అండగా ఉంటుంది. అందాల్సిన ప్రభుత్వ ప్రయోజనాలన్నీ త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటాం" అని జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

34 ఏళ్ల విశిష్ట సేవలు..

1992లో కర్నూలు రెండవ బెటాలియన్లో కానిస్టేబుల్గా రంగారావు తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం కడప జిల్లా భాకరాపేట 11వ బెటాలియన్కు, ఆపై ఏఆర్ విభాగంలో చిత్తూరు జిల్లాకు బదిలీ అయ్యారు. అక్కడే ఏఆర్ హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి పొంది, జిల్లా పునర్విభజన తర్వాత అన్నమయ్య జిల్లాలో విధుల్లో చేరారు. మూడు దశాబ్దాలకు పైగా నిరంతర సేవలు అందిస్తూ ఉన్నతాధికారుల మన్ననలు పొందారు.

ఆర్థిక సాయం అందజేత..

మృతుని భార్య చంద్రకళ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడిని రిజర్వ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ పరామర్శించారు. ఎస్పీ గారి సూచన మేరకు తక్షణ సహాయంగా దహన సంస్కారాల నిమిత్తం ₹1,00,000/- తక్షణ ఆర్థిక సహాయాన్ని మృతుడి భార్య చంద్రకళ గారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని తమ సహచరుడికి ఘన నివాళులర్పించారు.

జారీ చేసిన వారు: జిల్లా ఎస్పీ గారి పీఆర్వో, అన్నమయ్య జిల్లా.

మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, ఎస్పీ గారి ఆదేశాల మేరకు తక్షణ ఆర్థిక సాయం ₹1,00,000/- అందజేస్తున్న రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎం. రవికుమార్

కర్నూలులో ఏఆర్ పోలీస్ సిబ్బంది గాలిలోకి కాల్పులు జరిపి గన్ సెల్యూట్తో అధికారిక లాంఛనాలతో నివాళులర్పిస్తున్న దృశ్యం