BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 21 May 2026, 09:52 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పోలీసుల ఆరోగ్యంపై జిల్లా ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
21 May, 2026 - 09:52 PM
149 వీక్షణలు

పోలీసుల ఆరోగ్యంపై జిల్లా ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ..

మదనపల్లిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపిఎస్ 

మదనపల్లి, అన్నమయ్య జిల్లా  మే 21:

అహర్నిశలు ప్రజల రక్షణ కోసం శ్రమిస్తున్న పోలీసు అధికారుల, సిబ్బంది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపిఎస్ గురువారం మదనపల్లిలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో భారీ ఉచిత వైద్య శిబిరాన్ని ఘనంగా ప్రారంభించారు. విధి నిర్వహణలో నిత్యం తీవ్ర ఒత్తిడికి లోనయ్యే పోలీసులు తమ ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించకుండా, ఇలాంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఎస్పీ పిలుపునిచ్చారు.

అంజనా స్కాన్స్ అండ్ డయాగ్నోస్టిక్స్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో సిబ్బందికి అత్యంత కీలకమైన సి.బి.సి (రక్త పరీక్ష), కిడ్నీ, లివర్, లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలతో పాటు బ్లడ్ షుగర్ మరియు మూత్ర పరీక్షలను పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని పోలీస్

అధికారులు, సిబ్బంది మరియు హోంగార్డులు ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య సంరక్షణ కోసం ఈ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఎస్పీ సూచించారు.

పోలీసుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన అంజనా డయాగ్నోస్టిక్స్ యాజమాన్యానికి ఈ సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ తరపున ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ హెల్త్ క్యాంప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ ఎం. వెంకటాద్రి ఏఆర్ డిఎస్పీ శ్రీ డి. ఏడుకొండల రెడ్డి , పలువురు సీఐలు, ఆర్బలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, హోంగార్డులతో పాటు పోలీసు కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై ఉచిత మెడికల్ చెకప్ పరీక్షలు చేయించుకున్నారు.