BREAKING
thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
Date of Publish : 28 June 2026, 03:40 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

Pulse Polio: ప్రతి చిన్నారికి చుక్కలు వేయించాలని చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి పిలుపు

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
28 Jun, 2026 - 03:40 PM
240 వీక్షణలు

జగిత్యాల జిల్లా, ధర్మపురి | NTODAY NEWS

జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ పురపాలక సంఘం ఆవరణలో నిర్వహించిన పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి మాట్లాడుతూ, ఆరోగ్యవంతమైన భారతావని నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఐదేళ్లలోపు వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం తల్లిదండ్రుల ప్రాథమిక బాధ్యత అని స్పష్టం చేశారు.

పోలియో రహిత సమాజ నిర్మాణం కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఏ ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలకు దూరం కాకుండా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని కోరారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి ప్రజలు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ సంఘనబట్ల దినేష్, మున్సిపల్ కమిషనర్ ఎం. శ్రీనివాస్, కౌన్సిలర్లు వొజ్జెల లక్ష్మణ్, కొమురెల్లి పవనకుమార్, చిపిరిశెట్టి రాజేష్, ముడుసుల ప్రశాంత్, చుక్క సంధ్య, మున్సిపల్ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.