పోలవరం ఆరోగ్య ఉపకేంద్రానికి దాతల సహకారం
డివిజన్ రిపోర్టర్ అమెర్ల ధర్మా రావు
పోలవరం: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రానికి గ్రామానికి చెందిన దాతలు వైద్య సౌకర్యాల కోసం పలు పరికరాలను అందజేశారు. లేటు చల్లారి సత్యం జ్ఞాపకార్థం ఆయన కుమారుడు చల్లారి సూరిబాబు గౌడ్ ఆరోగ్య ఉపకేంద్రానికి రిఫ్రిజిరేటర్‌ను బహుకరించారు. అలాగే పోలవరం గ్రామస్తుల సహకారంతో రోగులు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా చెక్క బల్లలను, రక్తపోటు పరీక్షించేందుకు ఒక మాన్యువల్ రక్తపోటు కొలిచే పరికరం, ఒక డిజిటల్ రక్తపోటు కొలిచే పరికరాన్ని ఆసుపత్రి సిబ్బందికి అందజేశారు. గ్రామంలోని ఆరోగ్య ఉపకేంద్రానికి అవసరమైన పరికరాలను అందించి సహకరించిన దాతలకు వైద్య సిబ్బంది, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. స్థానికంగా వైద్య సేవలు అందుకునే ప్రజలకు ఈ పరికరాలు ఉపయోగకరంగా ఉంటాయని వారు పేర్కొన్నారు.