BREAKING
జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా
www.ntodaynews.com

పోతనపల్లి పెద్ద తండాలో ఎక్సైజ్ దాడులు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Apr, 2026 - 09:14 PM
169 వీక్షణలు

పోతనపల్లి పెద్ద తండాలో ఎక్సైజ్ దాడులు: నాటు సారా తయారీపై కేసు నమోదు

నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటు సారా నిర్మూలనపై అధికారుల కఠిన చర్యలు కొనసాగుతున్నాయి. ఏలూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ బి.శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ కే.నాగ ప్రభు కుమార్, జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి ఎ.అవులయ్య ఆదేశాల మేరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవోదయం 2.0 కార్యక్రమం కింద చాట్రాయి మండలం పోతనపల్లి పెద్ద తండా గ్రామంలో ప్రత్యేక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 50 లీటర్ల బెల్లపు ఊటను అధికారులు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో అదే గ్రామానికి చెందిన బాణావతు ధనలక్ష్మి భర్త చిన్న వెంకట సీతారామయ్యపై కేసు నమోదు చేసినట్లు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఏ.మస్తానయ్య వెల్లడించారు. అలాగే నూజివీడు ప్రొహిబిషన్ పరిధిలోని ఆగిరిపల్లి, నూజివీడు, ముసునూరు, చాట్రాయి మండలాల్లో బెల్ట్ షాపులు నిర్వహించే వారిపై, నాటు సారా తయారీ, విక్రయం, నిల్వ వంటి నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాటు సారా తయారీకి ఉపయోగించే బెల్లం సరఫరా చేసే వ్యాపారులు, బెల్లపు ఊట నిల్వ ఉంచే భూ యజమానులపై కూడా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఎవరైనా ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించాలనుకుంటే 9440902462 నంబర్‌కు ఫోన్ చేయవచ్చని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ తెలిపారు.