BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 02 June 2026, 05:00 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పోతనపల్లిలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలకు ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 05:00 PM
204 వీక్షణలు

ప్రైవేటు విద్య వద్దు.. ప్రభుత్వ బడులే ముద్దు" అనే నినాదంతో ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరుతూ ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని పోతనపల్లి, పరిసర ప్రాంతాల్లో మంగళవారం ప్రత్యేక ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష జిల్లా అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ పంకజ్ కుమార్, మండల విద్యాశాఖాధికారులు మాసగిరి శ్రీను, వి.ఎస్.వి. బ్రహ్మాచారి, ప్రధానోపాధ్యాయుడు నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొని "బడి పిలుస్తోంది" కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న పలు సంక్షేమ పథకాలు, సౌకర్యాలను తల్లిదండ్రులకు వివరించారు. నాణ్యమైన విద్యను అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్నట్లు తెలియజేశారు.

మండల విద్యాశాఖాధికారి మాసగిరి శ్రీను మాట్లాడుతూ, విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపుపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. ఉపాధ్యాయులు ప్రతిరోజూ గ్రామాల్లో పర్యటిస్తూ విద్యార్థులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ప్రభుత్వ పథకాల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు.

అలాగే పాఠశాలలు ప్రారంభమయ్యే సమయానికి ప్రతి విద్యార్థికి స్టూడెంట్ కిట్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుతున్న 14 మంది చిన్నారుల ఇళ్లకు వెళ్లి, వారి తల్లిదండ్రుల సమ్మతి తీసుకుని విద్యార్థుల వివరాలను పాఠశాలల్లో నమోదు చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సి.ఎమ్.ఓ యెహోషువ, ఏ.ఎల్.ఎస్ నాగేశ్వరరావు, ఐఈ కో-ఆర్డినేటర్ బొర్రా భాస్కరరాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సీఆర్ఎంటీలు, అంగన్‌వాడీ సిబ్బంది, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.