BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 27 August 2026, 02:49 pm
Posted by : బోధపల్లి వేణు

బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ నాయకుల ఆర్థిక సాయం

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
27 Aug, 2026 - 02:49 PM
49 వీక్షణలు

బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ నాయకుల ఆర్థిక సాయం

తొర్రూరు | ఆగస్టు 27 | N Today News

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు తొర్రూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మడిపల్లి గ్రామంలో ఇటీవల మృతి చెందిన రెండు కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు.

మడిపల్లి గ్రామానికి చెందిన గుంటుక రమేష్ ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. మాజీ ఎంపీటీసీ జక్కా మహబూబ్ రెడ్డి, జక్కా ఇంద్రసేన రెడ్డి రమేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి రూ.5,000 నగదు, 25 కేజీల బియ్యం అందించారు.

అదే గ్రామానికి చెందిన గొల్లపల్లి ముఖేష్ మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని కూడా నాయకులు పరామర్శించారు. ముఖేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబానికి రూ.3,000 నగదు, 25 కేజీల బియ్యం అందించారు.

ముఖేష్‌కు ఇద్దరు చిన్న ఆడపిల్లలు ఉండటంతో కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న ఆయనతో కలిసి కంటాయపాలెం హైస్కూల్‌లో 2009–10లో చదువుకున్న స్నేహితులు కూడా అండగా నిలిచారు. స్నేహితులంతా కలిసి రూ.20,500 నగదు, 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు అందించారు.

కష్టకాలంలో మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన స్నేహితులను జక్కా మహబూబ్ రెడ్డి అభినందించారు. బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి సహకారంతో అన్ని విధాలుగా అండగా ఉంటామని నాయకులు భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో మడిపల్లి మాజీ సర్పంచ్ గడిల మాధవి సాయిలు, వెన్నం సోమిరెడ్డి, వల్లంల వెంకటేశ్వర్లు, రావుల శ్రీనివాస్ రెడ్డి, ఎం.డి. యాకూబ్, మహంకాళి తదితరులు పాల్గొన్నారు.