BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 29 March 2026, 03:56 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ప్రైవేట్ బస్సుల అగ్ని ప్రమాదాలపై కట్టుదిట్టమైన తనిఖీలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Mar, 2026 - 03:56 PM
159 వీక్షణలు

ప్రైవేట్ బస్సుల అగ్ని ప్రమాదాలపై కట్టుదిట్టమైన తనిఖీలు – తిరువూరు చెక్‌పోస్ట్ వద్ద ఫైర్ సిబ్బంది అలర్ట్ 

తిరువూరు: ఇటీవల వరుసగా చోటుచేసుకున్న ప్రైవేట్ బస్సుల అగ్ని ప్రమాదాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై కఠిన ఆదేశాలు జారీ చేయడంతో ఫైర్ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ప్రమాదాలను ముందుగానే నివారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా చెక్‌పోస్టుల వద్ద విస్తృత స్థాయిలో తనిఖీలు చేపడుతున్నారు.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్–తెలంగాణ సరిహద్దులోని తిరువూరు చెక్‌పోస్ట్ వద్ద ఫైర్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది ఆదివారం తెల్లవారుజామున 6 గంటల నుంచే తనిఖీలు ప్రారంభించారు. రాత్రి, పగలు తేడా లేకుండా నిరంతరం వాహనాల పరిశీలన కొనసాగిస్తున్నామని అధికారులు తెలిపారు.

ప్రత్యేకంగా ప్రైవేట్ బస్సులపై దృష్టి సారించిన సిబ్బంది, ప్రతి బస్సును ఆపి సమగ్రంగా తనిఖీ చేస్తున్నారు. బస్సుల రిజిస్ట్రేషన్ పత్రాలు, ఫిట్‌నెస్ సర్టిఫికేట్లు, డ్రైవర్‌ల లైసెన్సులను పరిశీలిస్తూ, వాహనంలో సాంకేతిక లోపాలపై సవివరంగా ఆరా తీస్తున్నారు.

ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ పరికరాలు ఉన్నాయా, అవి సక్రమంగా పనిచేస్తున్నాయా అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇంధన లీకేజీలు, ఎలక్ట్రికల్ లోపాలు వంటి అగ్ని ప్రమాదాలకు దారితీసే అంశాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవడమే ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.

నిబంధనలు పాటించని వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, ప్రజల ప్రాణ భద్రతే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రయాణికులు కూడా అప్రమత్తంగా ఉండి భద్రతా నిబంధనలు పాటించేందుకు సహకరించాలని సూచించారు.

ఈ తనిఖీల్లో ఆర్. బుచ్చిబాబు (లీడింగ్ ఫైర్‌మ్యాన్), ఎస్. తిరుపతి వెంకయ్య (ఫైర్‌మ్యాన్), వై. సత్యనారాయణ (హోమ్ గార్డ్), డి. రాంబాబు (ఫైర్ ఆఫీసర్) పాల్గొని విధులు నిర్వహించారు.