BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 24 June 2026, 06:51 pm
Posted by : V శ్రీనివాస్

​ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
24 Jun, 2026 - 06:51 PM
286 వీక్షణలు

కరీంనగర్ లోని ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో తెలిపారు. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో, అలాగే 10వ తరగతి తెలుగు మీడియంలో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. 6 నుండి 14 సంవత్సరాల వయసు గల ఉత్తర తెలంగాణ రాష్ట్ర నివాసులైన అంధ బాలబాలికలు అర్హులని, ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, వరంగల్ జిల్లాల విద్యార్థులకు ప్రవేశాల్లో ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు పాఠ్య, నోటు పుస్తకాలు, యూనిఫామ్, పాదరక్షలు మరియు ఉచిత వసతి గృహ సౌకర్యం కల్పించనున్నట్లు ఆయన వివరించారు.

​ఆసక్తి గల విద్యార్థులు సదరం, యూడీఐడీ (UDID) దివ్యాంగ ధ్రువపత్రం, స్టడీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, బదిలీ సర్టిఫికెట్ (TC), రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులను కరీంనగర్ లోని విజయపురి కాలనీ, మల్కాపూర్ రోడ్డులో గల ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలలో స్వయంగా అందించాలని సూచించారు. ప్రవేశాలకు సంబంధించిన ఇతర వివరాలు తెలుసుకోవడానికి 9701190127, 9440338424 మొబైల్ నంబర్లలో సంప్రదించవచ్చని పాఠశాల ప్రిన్సిపల్ ఆ ప్రకటనలో కోరారు