BREAKING
thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్
Date of Publish : 24 June 2026, 06:48 pm
Posted by : V శ్రీనివాస్

​ప్రభుత్వ జూనియర్ కళాశాల పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ కుమార్ దీపక్

తెలంగాణ
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
24 Jun, 2026 - 06:48 PM
135 వీక్షణలు

మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న అభివృద్ధి, మరమ్మత్తు పనులను వేగవంతం చేసి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కళాశాలను సందర్శించి, అక్కడ జరుగుతున్న పనుల తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా చూస్తూనే, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత సమయంలోగా పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు.

​ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించే దిశగా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అందులో భాగంగానే ఈ జూనియర్ కళాశాలలో చేపట్టిన మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు