BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా అన్ని చర్యలు తీసుకోవాలి -- రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ డాక్టర్ క్రిస్టినా

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
25 Jun, 2026 - 09:29 PM
224 వీక్షణలు

యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ డాక్టర్ .క్రిస్టినా chongthu ,  డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నరేందర్ కుమార్ ,టీజీఎంఎస్‌ఐడీసీ చీఫ్ ఇంజనీర్ శశిధర్‌, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తో కలసి జిల్లాలో కొనసాగుతున్న వైద్య మౌలిక సదుపాయాల పనులను గురువారం పరిశీలించారు.ముందుగా జిల్లాలో నిర్మాణంలో ఉన్న నూతన మెడికల్ కళాశాల మరియు నర్సింగ్ కాలేజీ భవన నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అవసరమైన మౌలిక వసతులు, విద్యార్థులకు అందించాల్సిన సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.అనంతరం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)ని తనిఖీ చేసి, వార్డులను కలియ తిరిగారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణీ స్త్రీలతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు.నవ జాత శిశువుల సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. క్రిటికల్ కేర్ ను సందర్శించి అక్కడ అందుతున్న వైద్య సదుపాయల గురించి ఆరా తీశారు.వైద్యులు, సిబ్బంది రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు.ఆసుపత్రి పరిధిలోని టి-హబ్‌ను సందర్శించి ల్యాబ్ టెస్ట్ ల గురించి అడిగి,అక్కడ నిర్వహిస్తున్న పరీక్షల గురించి అడిగి తెలుసుకున్నారు. అన్ని పరీక్షలు నిర్వహించాలన్నారు.రోజు వారీ సేవలు, అందుబాటులో ఉన్న పరికరాలు, పనిచేస్తున్న సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు వేగవంతమైన, మెరుగైన వైద్య సేవలు అందించేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమం లో డివిజనల్ రెవిన్యూ అధికారి కృష్ణా రెడ్డి, ఇంచార్జి సూపడెంట్ అరుణ కుమారి, ఇంచార్జి ప్రిన్సిపాల్ లక్ష్మణరావు,జిల్లా వైద్యాధికారి మనోహర్, డిసి హెచ్ఎస్ సూర్యశ్రీ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.