BREAKING
thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా
Date of Publish : 25 June 2026, 09:44 pm
Posted by : ఇప్పలపల్లి నరేందర్

సమస్యల వలయాల్లో భువనగిరి కేజీ బీవీలో నీటి కొరత, అధికారులు వచ్చి వెళుతున్నా - సమస్యలు యథాతథం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
25 Jun, 2026 - 09:44 PM
196 వీక్షణలు

భువనగిరి జిల్లా కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో ఉన్న  కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం సమస్యలతో సతమతమౌతుంది. సుమారు 300 మంది బాలికలు విద్యనభ్యసిస్తున్న విద్యాలయంలో నీటి సరఫరాకు సంబంధించిన శాస్వత పరిష్కారం  అధికారులు చేయలేక పోతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు, బాలల హక్కుల సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. గతంలో  నీటి కొరత తీవ్రంగా ఉందని గుర్తించిన అప్పటి భువనగిరి ఆర్డీవో భూపాల్ రెడ్డి, ప్రభుత్వ నిధులతో బోరు వేయించారు.ఆ బోరు వర్షా కాలంలో సరిపడా నీటిని అందిస్తున్నా,ఎండా కాలంలో మాత్రం నీటి తిప్పలు తప్పడం లేదు. పాఠశాల ప్రారంభమై వారం రోజుల గడుస్తున్నాయి.ఎండలు ఎక్కువగా ఉండడం, వర్షాలు పడకపోవడంతో నీటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. విద్యార్థులు కాలకృత్యాలు తీర్చుకునేందుకు, స్నానాలు చేయడానికి తగినన్ని నీళ్లు లేకపోవడంతో స్నానాలు చేయడం లేదు. ఒకవైపు విపరీతమైన ఎండలు, మరొకవైపు నీటి కొరతతో కొందరు విద్యార్థులు సిక్ లీవ్ పెట్టుకుని ఇళ్ళకు వెళుతున్నారు. మున్సిపల్ అధికారులు ఇందిరమ్మ కాలనీ వాసులకు, మరియు కేజీ బీవీ పాఠశాల కు వేరువేరుగా ట్యాంకర్ల కేటాయించినా అవి సక్రమంగా నీటి సరఫరా చేయడం లేదని ఆరోపణలు వినబడుతున్నాయి. మండల  స్థాయి అధికారుల నుంచి జిల్లా కలెక్టర్ వరకు అనేక మంది అధికారులు పాఠశాల పర్యవేక్షణ పేరుతో సందర్శించినా, నీటి సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బాలికలకు నీటి వసతి కల్పించాలని బాలికలు, బాలల హక్కుల సంఘం నాయకులు కోరుతున్నారు.