BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 25 June 2026, 07:22 pm
Posted by : కూనురు మధు

యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి : జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

తెలంగాణ
/ నల్గొండ / నార్కెట్ పల్లి
25 Jun, 2026 - 07:22 PM
254 వీక్షణలు

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని విద్యార్థుల ప్రతిజ్ఞ

యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం భాగస్వాములు కావాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్  పిలుపునిచ్చారు. రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ ఐపిఎస్ ఆదేశాల మేరకు, మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో గురువారం నార్కట్‌పల్లి పరిధిలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ప్రత్యేక అవగాహన, ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.​ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ. డ్రగ్స్ మహమ్మారి యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల వినియోగం కేవలం ఒక వ్యక్తిగత జీవితాన్ని మాత్రమే కాకుండా, వారి కుటుంబాలను, మొత్తం సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని వివరించారు. ప్రతి విద్యార్థి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు. అనంతరం వర్సిటీ ప్రాంగణంలో విద్యార్థులంతా కలిసి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామంటూ  ​నో టు డ్రగ్ - ఎస్ టూ లైఫ్   అనే నినాదంతో ప్రతిజ్ఞ చేశారు. ఈ అవగాహన సదస్సులో మహాత్మా గాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్, నార్కట్‌పల్లి సీఐ సురేష్, ఎస్సై విష్ణు మూర్తి పాటు యూనివర్సిటీ విద్యార్థులు, వర్సిటీ అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.