BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 25 June 2026, 07:20 pm
Posted by : కూనురు మధు

ఉరుమడ్ల లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణకు శ్రీకారం.

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
25 Jun, 2026 - 07:20 PM
209 వీక్షణలు

జూన్ 25 నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రారంభం.

అధికారులు BLO మరియు BLA2 లు సమన్వయంతో సహకరించాలని  BLA2 ల ఇంచార్జ్ పల్లపు బుద్ధుడు సూచన.

తెలంగాణ రాష్ట్రంలో భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (స్పెషల్ ఇంటెన్సివ్  రివిజన్ - సర్ )ను జూన్ 25, 2026 నుంచి ప్రారంభించిందని BLA2 ల ఇంచార్జ్ పల్లపు బుద్ధుడు గురువారం  తెలిపారు. అర్హులైన ప్రతి పౌరుడు ఓటరు జాబితాలో తమ వివరాలు సక్రమంగా నమోదు చేసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ సవరణలో భాగంగా జూన్ 25 నుంచి జూలై 24, 2026 వరకు బూత్ లెవల్ అధికారులు ( బిఎల్ఓ) ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయనున్నారని, ఓటర్లు తమ కుటుంబ సభ్యుల వివరాలను పరిశీలించి, అవసరమైన సమాచారం నమోదు చేసి ఫారాలను సమర్పించాల్సి ఉంటుందని అన్నారు. ఫారంలో పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, ఫోన్ నంబర్, తల్లిదండ్రుల వివరాలు తదితర సమాచారాన్ని నమోదు చేయాల్సి ఉంటుందని, 2002 సంవత్సరం తర్వాత జన్మించిన ఓటర్లు తమ తల్లిదండ్రుల జననానికి సంబంధించిన వివరాలు కూడా అందించాల్సి ఉంటుందని BLA2 ల ఇంచార్జ్ పల్లపు బుద్ధుడు  సూచించారు. అలాగే, ఓటర్లు తమ వివరాలను ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేసుకునే అవకాశం కల్పించారని,  ఇందుకోసం voters.eci.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి ఎన్యూమరేషన్ ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకుని పూర్తి చేసి అప్లోడ్ చేయవచ్చని తెలిపారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి బాధ్యత అని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకుని ప్రజాస్వామ్య బలోపేతానికి సహకరించాలని ఉరుమడ్ల, చిన్నకాపర్తి, తాళ్ల వెల్లంల, వేంబావి, బోయగుబ్బ, మోర్స్ గూడెం, మొగిలి దొరి వివిధ గ్రామాల BLA2 ఇంచార్జ్ గా పనిచేస్తున్న పల్లపు బుద్ధుడు  పిలుపునిచ్చారు. సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1950ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.