విద్యా వ్యవస్థను బాగు చేస్తామని ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్
కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పీఠం ఎక్కాక మంచి పనులు మానేసి అన్ని ముంచే పనులు చేస్తున్నారు అని మాజీ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు గురువారం రోజున బొమ్మలరామారం మండలంలోని పక్కిర్ గూడెం గ్రామంలో మాజీ సర్పంచ్ గణేష్ నూతన గృహప్రవేశం కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి తో కలిసి పాల్గొన్నారు, గ్రామంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మతల్లి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యా వ్యవస్థను బాగు చేస్తామని ఎన్నో హామీలు ఇచ్చారు అని అన్నారు ఇప్పుడు హామీలను తుంగలో తొక్కి గ్రామాలలో ఉన్న బడులను ఎత్తివేసే పరిస్థితి కనిపిస్తుంది అని అన్నారు కొత్తగా మండలానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రారంభిస్తామని ఆ భవనానికి రెండు కోట్ల రూపాయలు వెచ్చిస్తామని చెప్తున్నారు, అధికార పీఠం ఎక్కాక మంచి పనులు మానేసి అన్ని ముంచే పనులు చేస్తున్నారు అని అన్నారు ఈరోజు విద్యారంగాన్ని సంస్కరిస్తామంటూ చెప్పిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా గోల్మాల్ చేస్తున్నారు.చిన్న చిన్న తండాలలో గూడాలలో ఉండాల్సిన బడులు మూతపడే పరిస్థితి వచ్చింది అని అన్నారు మండల కేంద్రానికి పంపించే పరిస్థితి లేక తల్లిదండ్రులు పిల్లలను బడి మానేసే పరిస్థితి ఏర్పడిందని అన్నారు బడి ఈడు పిల్లలు 100% బడిలో ఉండాలి కానీ రేవంత్ సర్కార్ తీసుకునే నిర్ణయాలు అనేకమంది పిల్లల్ని బడికి దూరం చేసే పరిస్థితి కనిపిస్తుంది అని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు రాష్ట్ర బడ్జెట్లో విద్యకు 15% నిధులు కేటాయిస్తామని ప్రకటించారు,ప్రతి గ్రామంలో ప్రైమరీ స్కూల్,మండల కేంద్రంలో హై స్కూల్, జూనియర్ కాలేజ్, జిల్లా కేంద్రంలో డిగ్రీ, పీజీ కాలేజీలు అని రేవంత్ రెడ్డి చెప్పాడు.ఫీజ్ రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రైవేట్ స్కూల్లో ఫీజుల నియంత్రణకు దోహదపడుతుందని ఎన్నికల ముందు చెప్పారు కానీ ఇప్పటివరకు ఆ కమిటీ ఊసే లేదు అని అన్నారు ప్రతి విద్యార్థికి ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పారు. మధ్యాహ్న భోజన కార్మికులకు నెలవారి వేతనాన్ని 10,000/- ఇస్తామని చెప్పారు. ఇప్పుడు సర్కారు బడులలో మధ్యాహ్న భోజన పనిని వంట కార్మికులకు కాక ఎన్జీవోలకు అప్పచెప్పారు.గతంలో మూసివేసిన 6000 స్కూలను తెరిపిస్తామని, ప్రకటనకు మాత్రమే పరిమితమైనది ఈ ప్రభుత్వం అని అన్నారు విద్యా సంవత్సరం మొదలైనప్పటికీ ఇప్పటివరకు పాఠశాలల్లో యూనిఫామ్,పుస్తకాల పంపిణీ జరగలేదు అని,ఫీజు రీయంబర్స్మెంట్ పథకం అటకెక్కించారు.డిగ్రీ, పీజీ కోర్సులు చదువుకునే ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు, మరిచారు అని అన్నారు కెసిఆర్ విదేశాలకు వెళ్లి చదువుకునే వారికి ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం ద్వారా 20 లక్షల ఆర్థిక సాయం చేసేవారు,కాంగ్రెస్ పార్టీ 25 లక్షల ఆర్థిక సాయం చేస్తామని హామి ఇచ్చి ఇప్పుడా పథకమే లేకుండా చేశారు అని అన్నారు రాష్ట్ర బడ్జెట్లో విద్యకు 15% కేటాయిస్తామని చెప్పారు అంటే ఏటా 45 వేల కోట్లు కేటాయించాలి,కానీ ఈ రెండున్నర సంవత్సరాలలో 21 వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించి విద్య శాఖ పై నిర్లక్ష్యాన్ని చూపించారు అని అన్నారు రేవంత్ రెడ్డి నియమించిన విద్యా కమిషన్ 18 నుండి 20% నిధులు కేటాయించాలని సిఫారసు చేసింది, కమిషన్ యొక్క రెకమండేషన్ కూడా కాతరు చేయలేదు అని అన్నారు ఎన్నో హామీలు తుంగలో తొక్కిన రేవంత్ రెడ్డికి విద్యాశాఖ సంబంధించిన హామీలు ఎందుకు గుర్తుంటాయి? అని అన్నారు డీఎస్సీ పేరిట 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు ఇప్పుడేమో టీచర్లకు జీతాలు ఎక్కువ అవుతున్నాయి మొత్తం బడ్జెట్ టీచర్ల జీతాలకే పోతున్నవి,టీచర్లు రాజకీయాలు చేస్తున్నారు అంటూ విద్యా వ్యవస్థను బ్రష్టు పట్టించే ప్రయత్నమే కాక చదువు చెప్పే గురువులను కూడా అవమానించే కుసంస్కారం మన ముఖ్యమంత్రి ది అని అన్నారు సంఘసంస్కర్తలు,మేధావులు మేలుకోండి.. ప్రతిపక్ష పార్టీలు మాట్లాడితే రాజకీయమంటారు కాబట్టి మీరే విద్యా వ్యవస్థను మార్చటానికి భవిష్యత్తు తరాల పురోగమనానికి మీరు కంకణం కట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం అని అన్నారు మీ మాటైనా మూర్ఖపు ముఖ్యమంత్రి వింటాడేమో అని ఆశ... కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదువుకొనే విద్యార్థుల హాజరు పెంచడానికి సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించింది, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఈ పథకాన్ని నిలిపివేసింది,రెండున్నర ఏండ్ల తర్వాత ఈ విద్యాసంస్థ నుండి పునర్ప్రరంబించింది, ఇది కొన్ని బడులకు,కాలేజీలకు పరిమితం చేసింది అని అన్నారు ఈ మీడియా సమావేశంలో కల్లూరి రామచంద్ర రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పోలగోని వెంకటేష్ గౌడ్, పకీర్ గూడెం సర్పంచ్ బోయిని లతా నరసింహ, చీకటి మామిడి సర్పంచ్ నాగరాజ్ గౌడ్, కట్ట శ్రీకాంత్ గౌడ్,బోనం కూర మల్లేష్, రాగుల బలరాం,జూపల్లి భరత్ తదితరులు పాల్గొన్నారు..