BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేత

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 May, 2026 - 03:30 PM
163 వీక్షణలు

ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేత

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల డీపీఆర్‌టీయూ శాఖ ఆధ్వర్యంలో పదో తరగతి ఫలితాల్లో మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి స్థానం సాధించిన విద్యార్థులతో పాటు మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు.

మండలంలో సూరంపాలెం హ్యాబిటేషన్‌లో పనిచేస్తున్న డీపీఆర్‌టీయూ సభ్యుడు జి.డి.వి. విజయకుమార్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ బహుమతులను విద్యార్థులకు ప్రదానం చేశారు. ప్రథమ స్థానం సాధించిన వారికి రూ.2016, ద్వితీయ స్థానం వారికి రూ.1516, తృతీయ స్థానం వారికి రూ.1016 నగదు బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నూజివీడు డివిజన్ ఉపవిద్యాశాఖాధికారి పి.ఎస్. సుధాకర్, ఎంఈఓ–1 మాసగిరి శ్రీనివాస్, ఎంఈఓ–2 వీఎస్వీ బ్రహ్మచారి, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు, నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు మోరంపూడి శ్రీనివాసరావు లు యజరయ్యారు. అలాగే జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, డీపీఆర్‌టీయూ చాట్రాయి మండల అధ్యక్షుడు బి.సి.హెచ్. రాంబాబు, ప్రధాన కార్యదర్శి టి. రామారావు, జిల్లా నాయకులు సత్తెనపల్లి రాము, వెదుళ్ల వెంకటేశ్వరరావు, దారావత్తు నాగేశ్వరావు, చిన్నం శ్రీనివాస్, బాణావతు శ్రీను, జక్కం రాజేష్, అల్లాడ కృష్ణ, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.