BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 22 May 2026, 06:05 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పర్వతాపురం లో అంకమ్మ తల్లికి వైభవంగా 16 రోజుల పండుగ సేవలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 May, 2026 - 06:05 PM
174 వీక్షణలు

పర్వతాపురం లో అంకమ్మ తల్లికి వైభవంగా 16 రోజుల పండుగ సేవలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామంలోని పురాతన అంకమ్మ తల్లి నూతన ఆలయ ప్రతిష్టకు 16 రోజులు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఘనంగా పండుగ సేవలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.

చెన్నారాయుడు సేవలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సన్నాయి, వీరంగాలు, మంగళ వాయిద్యాలతో గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. భక్తులు మొక్కులు చెల్లించుకుంటూ అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు.

ఈ సందర్భంగా నిర్వాహకుడు, మాజీ సర్పంచ్ మిద్దె శివాజి మాట్లాడుతూ అంకమ్మ తల్లి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ, ఆలయ అభివృద్ధికి గ్రామస్తులు అందరూ సహకరించారని అన్నారు. భక్తులందరూ ఐక్యంగా పాల్గొని పండుగను విజయవంతం చేయడం ఆనందంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.