BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 02 June 2026, 03:36 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పర్వతాపురంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 03:36 PM
276 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను టీడీపీ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ బూబత్తుల చెన్నారావు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాల అమలుతో పాటు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగ కల్పనకు కృషి చేస్తున్నారని తెలిపారు. అలాగే గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడు ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

వైసీపీ చేస్తున్న తప్పుడు ఆరోపణలను టీడీపీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి వెంటనే తిప్పికొట్టాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షురాలు బొర్రా నాగమల్లేశ్వరి, గ్రామ పార్టీ మాజీ అధ్యక్షుడు బొర్రా నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.