BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 15 August 2026, 08:03 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పర్వతాపురంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Aug, 2026 - 08:03 PM
82 వీక్షణలు

పర్వతాపురంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పర్వతాపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మీనా కుమారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశభక్తిని చాటుకున్నారు.

ఈ కార్యక్రమానికి పార్టీలకతీతంగా గ్రామంలోని నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. బొర్రా నాగమల్లేశ్వరి, మిద్దే శివాజీ, బూబత్తుల చెన్నారావు, మిద్దె సత్యనారాయణ, బొర్రా నాగేశ్వరరావు, ఉయ్యాల దిలీప్ కుమార్, మేకపోతుల వెంకటేశ్వరరావు, బయగాని మల్లికార్జున్ రావు, కల్లేపల్లి ప్రభాకర్, చీపు మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం లభించిందని, వారి ఆశయాలను నెరవేర్చేలా ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, సేవా భావాలను పెంపొందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై ఉందని పేర్కొన్నారు.

అనంతరం విద్యార్థులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.