BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 17 March 2026, 01:07 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పశువుల ఆరోగ్యానికి గాలికుంటు టీకాలు తప్పనిసరి మోరంపూడి శ్రీనివాసరావు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Mar, 2026 - 01:07 PM
315 వీక్షణలు

పశువుల ఆరోగ్యానికి గాలికుంటు టీకాలు తప్పనిసరి మోరంపూడి శ్రీనివాసరావు 

చాట్రాయి, మార్చి 17: రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవడం ద్వారా పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాస రావు సూచించారు.

మంగళవారం ఉదయం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో ఎల్‌ఏఎస్‌ఏ ఆధ్వర్యంలో గేదెలకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ పాడి రైతులు తమ పశువులకు సమయానికి టీకాలు వేయించడం వల్ల వ్యాధి వ్యాప్తిని అరికట్టడంతో పాటు పాల ఉత్పత్తి తగ్గకుండా కాపాడుకోవచ్చన్నారు.

అలాగే దూడల్లో మరణాలను నివారించి అవి ఆరోగ్యంగా ఎదిగేలా చేయవచ్చని తెలిపారు. నాలుగు నెలల వయస్సు దాటిన ప్రతి ఆవు, గేదెకు తప్పనిసరిగా గాలికుంటు టీకా వేయించాలని రైతులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు నెక్కళపు వెంకటేశ్వరరావు, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బుర్రి శ్రీకర్, గ్రామ కిసాన్ మోర్చా అధ్యక్షుడు కొత్తగుండ్ల రమేష్, మోదుగు ముత్తయ్య, ఎల్‌ఎస్‌ఏ పవనకుమారి, గోపాలమిత్ర వెంకటేశ్వరరావు, ఏహెచ్‌ఏ హరికృష్ణ తదితరులు, రైతులు పాల్గొన్నారు.