BREAKING
thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు
Date of Publish : 11 May 2026, 05:53 pm
Posted by : కూనురు మధు

పశువుల అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు : ఎస్పీ శరత్ చంద్ర పవార్

తెలంగాణ
/ నల్గొండ
11 May, 2026 - 05:53 PM
397 వీక్షణలు

NTODAY NEWS నల్గొండ జిల్లా 

బక్రీద్ పండుగను పురస్కరించుకొని జిల్లాలో పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సోమవారం కేతేపల్లి మండలం  కోర్లపాడ్ టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్‌పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనాల తనిఖీ తీరును స్వయంగా పరిశీలించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ​​జిల్లా వ్యాప్తంగా ప్రధాన రహదారులు, సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ముఖ్యంగా కంటైనర్ లారీలు, అనుమానాస్పద వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, 24 గంటల పాటు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.​ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పశువులను తరలించే వాహనాలకు తప్పనిసరిగా రవాణా పత్రాలు, వెటర్నరీ వైద్యుల సర్టిఫికెట్లు ఉండాలని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించి అక్రమ రవాణాకు పాల్పడినా, జంతు క్రూరత్వానికి ఒడిగట్టినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ రవాణాకు సంబంధించి ప్రజలకు ఏవైనా సమాచారం తెలిస్తే వెంటనే డయల్-100కు కాల్ చేయాలని సూచించారు. అంతేకాకుండా ​సోషల్ మీడియాపై నిఘా

​పండుగ పూట మత విద్వేషాలను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను సహించేది లేదని స్పష్టం చేశారు. ​ఈ ఆకస్మిక తనిఖీల్లో ఎస్పీ వెంట నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, నకిరేకల్ సీఐ హరిబాబు, కేతపల్లి ఎస్సై సతీష్, శాలిగౌరారం ఎస్సై సైదులు మరియు ఇతర పోలీస్ సిబ్బంది ఉన్నారు.