BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

పుంగనూరు INTACH చాప్టర్ కన్వీనర్ -కో కన్వీనర్ ల నియామకం..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
26 Jun, 2026 - 11:09 PM
37 వీక్షణలు

అన్నమయ్య జిల్లా పుంగనూరు 

భారతదేశ సాంస్కృతిక, చారిత్రక, ప్రకృతి వారసత్వ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న INTACH (ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్) (భారత జాతీయ కళా సంస్కృతి వారసత్వ పరిరక్షణ సంస్థ) సంస్థ, పుంగనూరు చాప్టర్ కి సరుం మహీపాల్ రెడ్డి గారిని కన్వీనర్, చిట్టిమిరెడ్డి భాస్కర్ రెడ్డి ని కో-కన్వీనర్ నియమించింది.ఈ మేరకు INTACH కేంద్ర కార్యాలయం,న్యూఢిల్లీ నియామక ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ సందర్భంగా నూతన కన్వీనర్ సరుం మహీపాల్ రెడ్డి మాట్లాడుతూ,తమపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతలను అప్పగించిన INTACH కేంద్ర కార్యాలయానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పుంగనూరు ప్రాంతంలోని చారిత్రక కట్టడాలు, దేవాలయాలు,చెరువులు,శిలాశాసనాలు, సాంప్రదాయ కళలు మరియు సాంస్కృతిక వారసత్వ సంపదను పరిరక్షించేందుకు ప్రజల భాగస్వామ్యంతో విస్తృత కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

కో-కన్వీనర్ చిట్టిమిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ,ఈ గౌరవప్రదమైన బాధ్యతను అప్పగించిన INTACH కేంద్ర కార్యాలయానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, కన్వీనర్తో కలిసి వారసత్వ పరిరక్షణ, విద్యార్థుల్లో అవగాహన, యువత భాగస్వామ్యం, పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ఈ నియామక ప్రక్రియలో విశేష సహకారం అందించిన కె. చిన్నపరెడ్డి, INTACH కడప చాప్టర్ కన్వీనర్ మరియు INTACH గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు & ఓ. వెంకటేశ్వర రెడ్డి (INTACH కడప సభ్యులు) మరియు ఈ నియామక ప్రక్రియలో డా. శరణ్ కుమార్ రెడ్డి, త్రిమూర్తి రెడ్డి,సుధాకర్ రెడ్డి,మధుసూదన్ రెడ్డి తదితరులు సభ్యులుగా అందించిన సహకారం విశేషమైనది. వీరికి నూతన నాయకత్వం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.పుంగనూరు చాప్టర్ ద్వారా హెరిటేజ్ వాక్స్, పాఠశాలలు మరియు కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు,చారిత్రక కట్టడాల డాక్యుమెంటేషన్, సంప్రదాయ కళల పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ప్రజలు, విద్యార్థులు,చరిత్రాభిమానులు, స్వచ్చంద సంస్థలు మరియు ప్రభుత్వ శాఖలు INTACH కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.