BREAKING
మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం
Date of Publish : 21 January 2026, 08:58 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ధర్మపురి అభివృద్ధికి బాటలు

తెలంగాణ
21 Jan, 2026 - 08:58 AM
340 వీక్షణలు
ధర్మపురి అభివృద్ధికి బాటలు: భారీగా తరలివెళ్లిన వెల్గటూర్ కాంగ్రెస్ శ్రేణులు NTODAY NEWS: వెల్గటూర్  రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో ధర్మపురి నియోజకవర్గంలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనుల శంఖస్థాపన కార్యక్రమం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా పాలనలో నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పలువురు ఎమ్మెల్యేలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వెల్గటూర్ నుంచి భారీగా హాజరు ఈ కార్యక్రమానికి వెల్గటూర్ మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలేందర్ రెడ్డి, సీనియర్ నాయకుడు మరియు ఆలయ కమిటీ చైర్మన్ మెరుగు నరేష్ నేతృత్వంలో కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పాల్గొన్న ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్ముల వెంకటేశం, ఎనగందుల నరేష్ పాల్గొన్నారు. అలాగే పాశిగాం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపతి నరేష్, బరుపటి జనార్దన్, బరుపటి అజయ్, కోన రాకేష్, కంటెం రాజు, కంటెం తిరుపతి, బరుపటి కొమురయ్య పాల్గొన్నారు. రాజక్కపల్లి గ్రామ సర్పంచ్ దొరిశెట్టి మల్లేశం, ఉపసర్పంచ్ మర్రి పోచయ్య, స్తంభంపల్లి సర్పంచ్ భపెల్లి రాజయ్య, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కశ శ్రీధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులతో ధర్మపురి నియోజకవర్గ రూపురేఖలు మారనున్నాయని, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కృషితో వెల్గటూర్ మండలం కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని నాయకులు ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. #DharmapuriDevelopment #Velgatur #CongressParty #PublicGovernance #DevelopmentWorks #TelanganaPolitics #PeopleParticipation Follow us on Website Facebook Instagram YouTube