BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 18 May 2025, 08:24 am
Posted by : NTODAY NEWS OFFICIAL

జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

తెలంగాణ
18 May, 2025 - 08:24 AM
251 వీక్షణలు
జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి- జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఏలూరు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్ 1800 233 1077 ఏలూరు, మే, 18 : రానున్న మూడు రోజులపాటు కోస్తా జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి జిల్లాలోని అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. ఏలూరు కలెక్టరేట్ లో టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్ 1800 233 1077 తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ చెప్పారు. పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని, గంటకి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిందని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా రెవిన్యూ సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. . ప్రతి మండలం ప్రధాన కేంద్రంలో, డివిజన్ ప్రధాన కేంద్రాలలో రెవెన్యూ సిబ్బంది 24x7 అందుబాటులో ఉండాలని తెలిపారు, పకృతి వైపరీత్యాల వల్ల ఎలాంటి నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండి ముందస్తుగానే పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎక్కడైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ వెట్రిసెల్వి కోరారు. Follow us on Website Facebook Instagram YouTube