BREAKING
thumb ● ఎమ్మెల్యేను కలిసిన మునగపాక హైస్కూల్ చైర్మన్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్ thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన బుద్ధా వెంకన్న thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb ● 15 రోజులుగా వీఆర్ఏల దీక్ష.. thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ thumb ● ఎమ్మెల్యేను కలిసిన మునగపాక హైస్కూల్ చైర్మన్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ చైర్‌పర్సన్ thumb ● పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు thumb ● చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన బుద్ధా వెంకన్న thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు వీడ్కోలు సన్మానం thumb ● 15 రోజులుగా వీఆర్ఏల దీక్ష.. thumb ● 2027 జనాభా లెక్కల సేకరణలో 21 రకాల వైకల్యలను సేకరించాలి thumb ● పద్మశాలి సంఘం నేత పున్న శ్రీనివాసులుకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం thumb ● ఇరిగేషన్ కాలువపై నిర్మాణంపై ఫిర్యాదు thumb ● బత్తలూరులో స్మశాన వాటికకు కొత్త రోడ్డు నిర్మాణానికి భూమిపూజ
Date of Publish : 15 August 2026, 09:17 pm
Posted by : కూనురు మధు

ఫైర్ మెన్ నూతి కాశీరామ్‌కు ఉత్తమ సేవ ప్రతిభా పురస్కారం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
15 Aug, 2026 - 09:17 PM
293 వీక్షణలు

ఫైర్ మెన్ నూతి కాశీరామ్‌కు ‘ఉత్తమ సేవ’ ప్రతిభా పురస్కారం

18 ఏళ్ల విశిష్ట సేవలకు దక్కిన గుర్తింపు  పురస్కారాన్ని అందజేసిన శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి


నిరంతరం ప్రాణ ఆస్తి నష్టాలను నివారించడంలో శ్రమిస్తూ, ప్రజాసేవలో తనదైన ముద్ర వేసిన రామన్నపేట ఫైర్ స్టేషన్ సిబ్బంది నూతి కాశీరామ్‌ను ‘ఉత్తమ సేవ’ ప్రతిభా పురస్కారం వరించింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన అందించిన విశిష్ట సేవలకు గాను అగ్నిమాపక శాఖ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. స్వాతంత్ర వేడుకలు భాగంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ ఆకాంక్ష యాదవ్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి మధుసూదన్ రావు సమక్షంలో యాదాద్రి భువనగిరి ​జిల్లా కేంద్రంలో జరిగిన వేడుకల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేతుల మీదుగా కాశీరామ్ ఈ ప్రతిభా పురస్కారాన్ని ఘనంగా అందుకున్నారు. ​​గత 18 సంవత్సరాలుగా అగ్నిమాపక శాఖలో బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తున్న కాశీరామ్, అనేక ప్రమాద సమయాల్లో ప్రాణాలకు తెగించి రక్షణ చర్యలు చేపట్టారు. అత్యవసర వేళల్లో తక్షణమే స్పందిస్తూ ప్రజల ఆస్తి, ప్రాణ నష్టాలను తగ్గించడంలో ఆయన చూపిన చొరవను అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. ప్రజాసేవలో 18 ఏళ్లుగా కొనసాగడం, ఈ సందర్భంగా కాశీరాం మాట్లాడుతూ శాఖ గుర్తించి ఇలాంటి పురస్కారంతో గౌరవించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ పురస్కారం నాపై బాధ్యతను మరింత పెంచిందని తెలిపారు. ​ఈ సందర్భంగా కాశీరామ్‌కు రామన్నపేట ఫైర్ స్టేషన్ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్థులు శుభాకాంక్షలు తెలియజేశారు.