BREAKING
thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు
Date of Publish : 03 October 2026, 08:05 pm
Posted by : కూనురు మధు

ఫోటోగ్రాఫర్‌ యేళ్ల బయ్యన్నకు కళాపురస్కార్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
03 Oct, 2026 - 08:05 PM
45 వీక్షణలు

NTODAY NEWS : చిట్యాల 

నల్గొండ జిల్లా చిట్యాల పట్టణానికి చెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్ యేళ్ల బయ్యన్న ఫోటోగ్రఫీ రంగంలో ప్రతిష్టాత్మక కళాపురస్కార్-26 అవార్డును అందుకున్నారు. సాంప్రదాయ ఫోటోగ్రఫీలో విశిష్ట ప్రతిభ కనబరిచినందుకు ఆయనకు ఉత్తమ ట్రెడిషనల్ ఫోటోగ్రాఫర్ అవార్డు లభించింది. ఈ నెల 2, 3, 4 తేదీల్లో శంషాబాద్‌లోని ఎస్‌ఎస్‌ కన్వెన్షన్ హాల్‌లో ఫోటోటెక్, ఎడిట్ పాయింట్ ఇండియా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోటోగ్రఫీ ఎక్స్‌పోలో భాగంగా భారత్ కళాపురస్కార్-26 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీలో సాంప్రదాయ ఫోటోగ్రఫీ విభాగంలో యేళ్ల బయ్యన్న ప్రతిభ కనబరిచి అవార్డును దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు అభిమన్యు రెడ్డి, ఇప్పలపల్లి రమేష్ చేతుల మీదుగా యేళ్ల బయ్యన్న అవార్డును అందుకున్నారు. చిట్యాల ప్రాంతానికి చెందిన ఫోటోగ్రాఫర్‌ ప్రతిష్టాత్మక వేదికపై అవార్డు అందుకోవడం పట్ల స్థానికులు, ఫోటోగ్రఫీ రంగానికి చెందిన పలువురు అభినందనలు తెలిపారు.