దసరా శరన్నవరాత్రులు, విజయదశమి తేదీలపై పురోహితుల స్పష్టత
తెలంగాణ
/
హన్మకొండ
హైదరాబాద్: దసరా శరన్నవరాత్రులు, విజయదశమి పండుగ తేదీలపై పురోహితులు స్పష్టత ఇచ్చారు. ఈ నెల 10న రాత్రి వరకు అమావాస్య ఉండటంతో 11వ తేదీ పాడ్యమి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు.
ఈ క్రమంలో 19న మహానవమి, 20న విజయదశమి (దసరా) పండుగను నిర్వహించుకోవాలని సూచించారు. 20న సాయంత్రం జమ్మి చెట్టు (శమీ వృక్షం)కు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో దసరా వేడుకలు ముగుస్తాయని పేర్కొన్నారు.
మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 18న సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మను ఆడిపాడి వేడుకలను నిర్వహించనున్నారు.