BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

రైతుల కష్టాలను ఆసరాగా చేసుకుని అప్పుల ఊబిలోకి దింపుతున్న ప్రైవేట్ హౌసింగ్ లోన్ సంస్థలు

తెలంగాణ
31 Mar, 2025 - 03:55 AM
143 వీక్షణలు
మార్చి 31(Ntoday న్యూస్) అనంతపురం జిల్లాలోని కూడేరు మండల పరిధి లోని కూడేరు మండలం ఉరవకొండ నియోజక వర్గంలోనే అత్యంత వెనుకబడిన మండలం గా జిల్లా రికార్డులలోనే పేరుంది. అలాంటి కుడేరు మండలంలో చాలా వరకు వ్యవసాయం మీద ఆధారపడి కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉన్నాయి. పెట్టిన పంటలకు రైతులకు గిట్టుబాటు ధర లేకుండా బాధ పడుతున్న సమయం లో ప్రైవేట్ హౌసింగ్ లోన్ సంస్థలు రైతులను కలిసాయి. ఆ సంస్థలు ఒక్క సరిగా మీ ఇంటి మీద హోసింగ్ లోన్స్ ఇస్తాము అని వారికి ఎనిమిది లక్షల నుండి 15 లక్షల వరకు ఇస్తామని రైతులకు ఎరవేసారు. దీనిని నమ్మిన రైతులు కొద్ది వరకు ఐనా అప్పుల ఉబి నుండి బయటకి రావాలని వెంటనే వారికి సరే అని లోన్లకు ఆమోదిస్తారు. అప్పటికి తెలియదు తాను పాతాళంలోకి వారు దింపుతున్నారని. ఎందుకంటే ఒక రైతుకు మోసం చేయటం తెలియదు. అనుకున్నదే తడువుగా హౌసింగ్ రిజిస్ట్టేషన్ ప్రక్రియ మొదలు అవుతుంది. ఆ తరువాత డాకుమెంట్స్ చార్జీలు ఇన్సూరెన్స్ అని దాదాపుగా 20000 నుండి 30000 వరకు అవి అన్ని కూడా రైతు తోనే చెల్లిస్తారు. ఇక లోన్ మొత్తం ఇచ్చిన తరువాత వాయిదాలు 10 సంవత్సరాలు గడువుని నిర్ణయిస్తారు. అంటే ఎనిమిది లక్షల గాను దాదాపుగా 11 వేల రూపాయలు నెల వాయిదా నిర్ణయిస్తారు. లోన్ ఇచ్చిన మొదట రైతు పశువుల తీసుకొని వాటి పాలతో వాయిదాలు కడుతూ వస్తాడు నాలుగు నెలల తర్వాత ఆవులు పాలు ఇవ్వడం ఆపివేసిన తర్వాత అప్పుడు మొదలవుతుంది వాయిదాలకు డబ్బులు అందుబాటుకు రావు ఫీల్డ్ ఆఫీసర్ నుంచి మేనేజర్ వరకు అందరూ ఇన్స్టాల్మెంట్స్ అడగడానికి వస్తారు. అప్పటికి రైతు ఎంతో ఓర్పుతో సహనంతో సమాధానం చెబుతూ వస్తాడు అయినా విననీ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు నువ్వు చేతకానప్పుడు ఎందుకు తీసుకున్నావు అంటూ కట్టగలిగే దమ్ముంటే నువ్వు తీసుకోవాలి లేకుంటే లేదు అని వారిని ఇబ్బందులు పెడుతూ వారు వాడుతున్న పదజాలం తో అక్కడున్న వారి ఇంటి ముందు కాలనీ వారి ఇంటి ముందు అవమానిస్తారు ఇలాంటి పరిస్థితుల్లో కాలనీవాసుల ముందు మాటల తూటాలతో రైతు మనసు గాయపరుస్తుంటారు. అంతటితో ఊరుకోకుండా రైతు యొక్క ఇంటి ఆవరణంలోని గోడకు ఈ ఇల్లు పలానా సంస్థ ఆధీనంలో ఉందని బహిరంగంగా లీగల్ కు వెళ్లిందని రాస్తారు. దీనితో రైతు అప్పు తీసుకున్నందుకు అవమానబరంతో మనసు కకావికలం అవుతుంది. ఆఖరికి ఆత్మహత్య శరణమని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కుడేరూ మండల వ్యాప్తంగా ఏడు కోట్లకు పై మాటే ప్రైవేట్ హౌసింగ్ లోన్ సంస్థల ఔట్ స్టాండింగ్ ఉందంటే రైతుల నుంచి ఏమేరా లోన్లు ఇచ్చారు. ఇట్టే అర్థమవుతుంది ఒక సంస్థకు తెలియకుండా మరొక సంస్థలో కూడా లోన్లు తీసుకునేల హౌసింగ్ లోన్ సంస్థ ప్రతినిధులు గుడ్డిగా ప్రజలను మాయ చేస్తున్నారో ఇట్టే అర్థమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ప్రైవేట్ హౌసింగ్ లోన్ సంస్థల పైన కొరడా జులిపించకపోతే భవిష్యత్తులో రాను రాను మరిన్ని రైతు ఆత్మహత్యలు చూడాల్సి వస్తుందని ప్రజాసంఘాల నాయకులు తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా ఈ హౌసింగ్ లోన్ సంస్థల వేధింపులు అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో మండల వ్యాప్తంగా రాస్తారోకోలు చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.