BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 29 January 2026, 08:01 am
Posted by : NTODAY NEWS OFFICIAL

పిచ్చి మొక్కల్లో తుప్పు పట్టిన ప్రజాధనం

తెలంగాణ
29 Jan, 2026 - 08:01 AM
237 వీక్షణలు
పాషిగామ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ నిర్వీర్యం పిచ్చి మొక్కల్లో తుప్పు పట్టిన ప్రజాధనం NTODAY NEWS: జగిత్యాల జిల్లా, గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ అధికారుల నిర్లక్ష్యంపై యువత ఆగ్రహం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాషిగామ గ్రామ పంచాయతీకి పారిశుధ్య పనుల కోసం అందించిన ట్రాక్టర్ ప్రస్తుతం నిర్వీర్యంగా మారి, పిచ్చి మొక్కల్లో తుప్పు పట్టి పాత ఇనుప సామానులా పడివున్న దృశ్యం గ్రామంలో చర్చనీయాంశంగా మారిందని. గ్రామ అభివృద్ధి కోసం, ప్రజా ధనంతో అందించిన ఈ ట్రాక్టర్‌ను ఉపయోగించకుండా నిర్లక్ష్యం చేయడం అధికారుల వైఫల్యానికి నిదర్శనమని గ్రామ యువత ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో చెత్త సమస్యలు, పారిశుధ్య లోపాలు ఉన్నప్పటికీ ట్రాక్టర్‌ను పనులకు వినియోగించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని వారు అన్నారు. ఈ విషయంపై స్పందించిన బీఆర్ఎస్ పార్టీ వెల్గటూర్ మండల సోషల్ మీడియా వింగ్ ఉపాధ్యక్షుడు ఉపారపు సతీష్ మాట్లాడుతూ, “గ్రామాభివృద్ధికి ఉపయోగించాల్సిన వాహనం ఇలా తుక్కు సామానులా మారడం బాధాకరమని. ఇది ప్రజాధనం వృథా అవుతున్న దానికి స్పష్టమైన ఉదాహరణ. ఇప్పటికైనా నూతన గ్రామ పాలకవర్గం, పంచాయతీ సిబ్బంది, సంబంధిత అధికారులు స్పందించి ఈ ట్రాక్టర్‌ను మరమ్మతులు చేసి గ్రామ పంచాయతీ పనులకు వినియోగించాలి” అని డిమాండ్ చేశారు. గ్రామాభివృద్ధికి ఇచ్చిన వాహనం నిర్లక్ష్యానికి గురికావడం పట్ల గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. #PublicMoney #VillageDevelopment #PanchayatIssues #Negligence #SanitationWorks #RuralInfrastructure #JagtialDistrict #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube