BREAKING
thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న ఆర్ఎస్ఎస్, బిజెపి విధానాలు తిప్పికొడదాం. thumb బాధితులకు సత్వర న్యాయం, ప్రజారక్షణే ధ్యేయంగా పనిచేయాలి: ఎస్పీ తుహిన్ సిన్హా thumb రాష్ట్ర TNTUC ఇన్‌చార్జిగా బొండా ఉమాకు ఘన సన్మానం thumb మునగపాకలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం thumb ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలపై పాలక మండలి కీలక నిర్ణయాలు thumb కొత్తపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు
Date of Publish : 02 August 2026, 03:14 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రాజవరం, పెనుగొలనులో ఘనంగా పింగళి వెంకయ్య 150వ జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Aug, 2026 - 03:14 PM
108 వీక్షణలు

రాజవరం, పెనుగొలనులో ఘనంగా పింగళి వెంకయ్య 150వ జయంతి వేడుకలు

గంపలగూడెం: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలంలోని రాజవరం గ్రామంలో జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 150వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాజీ గ్రామ సర్పంచి అబ్బూరి వెంకటయ్య మాట్లాడుతూ పింగళి వెంకయ్య గొప్ప దేశభక్తుడని, స్వాతంత్య్ర ఉద్యమంలో వందేమాతరం, హోం రూల్ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారని తెలిపారు. దేశానికి ప్రత్యేక జాతీయ పతాకం అవసరమనే సంకల్పంతో 1916లో "భారతదేశానికి ఒక జాతీయ పతాకం" అనే ఆంగ్ల గ్రంథాన్ని రచించారని వివరించారు.

గాంధీ సూచనల మేరకు కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో మధ్యలో రాట్నం గుర్తు ఉన్న జాతీయ పతాకాన్ని పింగళి వెంకయ్య రూపొందించారని, 1921లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ మహాసభలో ఆ పతాకాన్ని ఆవిష్కరించారని చెప్పారు. స్వాతంత్య్రం అనంతరం రాట్నం స్థానంలో అశోక చక్రాన్ని చేర్చి ప్రస్తుత జాతీయ పతాకాన్ని అమల్లోకి తీసుకువచ్చారని పేర్కొన్నారు.

విశ్వహిందూ పరిషత్ జిల్లా సమన్వయకర్త అన్నవరపు క్రాంతి కుమార్ మాట్లాడుతూ పింగళి వెంకయ్య జాతీయ పతాక రూపకర్త మాత్రమే కాకుండా పురాతన నాణేలు, భూగర్భ శాస్త్రం, వ్యవసాయం వంటి అనేక రంగాల్లో పరిశోధనలు చేసి పుస్తకాలు రచించిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు.

మాజీ సర్పంచి చెన్నుపాటి నరసింహారావు మాట్లాడుతూ కృష్ణా జిల్లా భట్లపెనుమర్రులో 1876 ఆగస్టు 2న జన్మించిన పింగళి వెంకయ్య తెలుగు వ్యక్తి కావడం ప్రతి తెలుగువారికి గర్వకారణమని అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మన్నే నరసింహమూర్తి, బండారుపల్లి వెంకట నరసయ్య, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు నేరెళ్ల యుగంధర్, సత్యసాయి సేవా కమిటీ సభ్యులు పారేపల్లి కృష్ణారావు, వై. జగన్నాథం, తొండపు శ్రీను, సుగ్గల ప్రసాద్, గ్రామస్తులు పాల్గొన్నారు.

పెనుగొలనులో వేడుకలు

గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో శిరిడి సాయిబాబా యూత్ కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు వూటుకూరు యజ్ఞ కృష్ణ అధ్యక్షతన పింగళి వెంకయ్య 150వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యం, మూడు రంగుల విశిష్టతను వివరించారు. అనంతరం గ్రామస్తులకు మిఠాయిలు పంపిణీ చేసి జాతీయ పతాకానికి గౌరవం కాపాడాలని పిలుపునిచ్చారు.