BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 15 April 2026, 08:22 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రాజ్యాంగ పరిరక్షణే అంబేద్కర్ కు నివాళి! డి.హరినాధ్

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Apr, 2026 - 08:22 AM
300 వీక్షణలు

రాజ్యాంగ పరిరక్షణే అంబేద్కర్ కు నివాళి! డి.హరినాధ్             

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినోత్సవ వేడుకలు చేసే పాలకులు భారత రాజ్యాంగ పరిరక్షణకు సిద్ధం కావాలని సిపిఐ ఎమ్ఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ పిలుపునిచ్చారు. ఎన్డీఏ పాలనలో మనువాద రాజ్యాంగాన్ని తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలన్నారు.నూజివీడులో సిపిఐ ఎంఎల్, లిబరేషన్ ఏఐసీసీ టీ యు ఆధ్వర్యంలో రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సదస్సు జరిగింది. ఈ సదస్సు కు ఏలూరు జిల్లా కార్యదర్శి వేముల బక్కయ్య అధ్యక్షత వహించారు. లేబర్ మాజీకమిషనర్ మోదుగు వెంకటేశ్వరరావు ప్రసంగిస్తూ డాక్టర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకు చేసిన కృషి మరువలేనిదని అన్నారు. కుల నిర్మూలన జరగాలని చెప్పిన ఆశయం ఇప్పటివరకు నెరవేరలేదన్నారు. అత్యున్నత న్యాయస్థానం దళిత క్రైస్తవులకుఎస్సీ రిజర్వేషన్ చెల్లదనిఇచ్చిన తీర్పు పునః సమీక్షించాలని కోరారు. మహిళలకు ఓటు హక్కు కల్పించడంలో అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదని ఏఐసీసీటీయీ రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు తామడ అరుణ తెలిపారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నం భోజన ఏజెన్సీలు రద్దుచేసి స్మార్ట్ కిచెన్ల పేరుతో కాంట్రాక్టర్లకు అప్పగించడానికి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకొని తీరుతామని అరుణ  హెచ్చరించారు. 20వ తేదీన నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికుల ధర్నా జరపాలని నిర్ణయించారు. ప్రభుత్వ చర్యలకు నిరసనగా విజయవాడ ధర్నా చౌక్ లో రాష్ట్రవ్యాప్త నిరసన ఆందోళన చేపడతామని బక్కయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో కలపాల రాణి జూట్రు కమల,పరికల కళావతి, దుర్గం పూజిత, పల్లెపాము భవాని, భూతం మారేసు , ఉన్నం అనిల్ తదితరులు పాల్గొన్నారు.