BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 26 July 2026, 12:54 pm
Posted by : కూనురు మధు

రామన్నపేట టు కీసర.. కల్తీ అల్లం పేస్ట్ భారీ దందా

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
26 Jul, 2026 - 12:54 PM
477 వీక్షణలు

రామన్నపేట టు కీసర.. కల్తీ అల్లం పేస్ట్ భారీ దందా 

  •  కీసర తయారీ కేంద్రంపై పోలీసుల మెరుపు దాడి!

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ లాభార్జనే ధ్యేయంగా సాగుతున్న కల్తీ రాయుళ్ల ఆటకట్టించేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు విరుచుకుపడ్డారు. రామన్నపేట కేంద్రంగా సాగుతున్న భారీ కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ ముఠా గుట్టును బయట పెట్టీ  తయారీ కేంద్రంపై మెరుపు దాడులు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసు సూపరింటెండెంట్  ఆదేశాల మేరకు, చౌటుప్పల్ డీఎస్పీ  మధుసూదన్ రెడ్డి  ప్రత్యక్ష పర్యవేక్షణలో రామన్నపేట పోలీసులు రంగంలోకి దిగారు. రామన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్  ఎం. రవి, ఎస్సై జి. సతీష్ తమ సిబ్బందితో కలిసి రామన్నపేట సెంటర్‌లో విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. ​ఈ తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా వెళ్తున్న ఒక వ్యాన్‌ను నిలిపి తనిఖీ చేయగా, ఎలాంటి అనుమతులు లేని, ప్యాకింగ్ నిబంధనలు పాటించని భారీ ఎత్తున అల్లం పేస్ట్ డబ్బాలు లభ్యమయ్యాయి. వాహన డ్రైవర్‌ను తమదైన శైలిలో పోలీసులు విచారించగా ఈ కల్తీ పేస్ట్ మూలాలు మేడ్చల్ జిల్లా కీసర ప్రాంతంలోని ఒక సీక్రెట్ తయారీ యూనిట్‌లో ఉన్నట్లు వెల్లడించాడు. ​డ్రైవర్ ఇచ్చిన పక్కా సమాచారంతో తక్షణమే స్పందించిన రామన్నపేట పోలీసులు, ఫుడ్ సేఫ్టీ  అధికారులతో కలిసి కీసరలోని సంబంధిత ప్రాంగణంపై సంయుక్తంగా మెరుపు దాడి నిర్వహించారు. పరిశ పరిశీలనలో అక్కడ ప్రమాదకర రసాయనాలు, కుళ్ళిన అల్లం, నిషిద్ధ పదార్థాలతో కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నట్లు తేలింది. ​ఘటనా స్థలంలో ఉన్న కల్తీ ముడి పదార్థాలు, కల్తీకి ఉపయోగిస్తున్న యంత్రాలు, విక్రయానికి సిద్ధంగా ఉన్న టన్నుల కొద్దీ ఫినిష్డ్ ప్రొడక్ట్ డబ్బాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదు అని, కల్తీ ఆహార పదార్థాల తయారీ, నిల్వ, రవాణా చేసే వారిపై పి.డి యాక్ట్ సహా కఠినమైన చట్టపరమైన జిల్లా పోలీసులు హెచ్చరించారు ​ఈ అక్రమ వ్యవహారంపై సంబంధిత ఆహార భద్రత చట్టాలు, భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెట్‌వర్క్ వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు ? ఎవరెవరికి ఈ కల్తీ పేస్ట్‌ను సరఫరా చేస్తున్నారు ? అనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు.


​సమయానుకూలంగా స్పందించి భారీ కల్తీ దందాను అరికట్టిన రామన్నపేట సీఐ, ఎస్సై, ఫుడ్ సేఫ్టీ అధికారులు మరియు జిల్లా పోలీసు యంత్రాంగాన్ని స్థానిక ప్రజలు, వినియోగదారుల సంఘాలు అభినందించాయి...