BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

​రాష్ట్రానికే రోల్ మోడల్‌గా మంచిర్యాల: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

తెలంగాణ
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
14 Jun, 2026 - 05:11 PM
182 వీక్షణలు

ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు నివాసంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశం

ముఖ్య అతిథులుగా హాజరైన ఉపముఖ్యమంత్రి భట్టి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు

​మంచిర్యాల అభివృద్ధిని పరిశీలించేందుకు ఇతర మున్సిపాలిటీల బృందాలను పంపుతాం: మంత్రి శ్రీధర్ బాబు

​మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి నివాసంలో ఏర్పాటు చేసిన 'మంచిర్యాల ఛాంబర్ ఆఫ్ కామర్స్' సమావేశానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, విద్య, వైద్యం, రోడ్ల తదితర మౌలిక వసతుల అభివృద్ధితో మంచిర్యాల నియోజకవర్గం రాష్ట్రానికే రోల్ మోడల్‌గా నిలుస్తుందని ప్రశంసించారు. ఇక్కడి అభివృద్ధిని పరిశీలించేందుకు రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల పాలకవర్గాలను, కమిషనర్లను మంచిర్యాలకు పంపాలని మంత్రి శ్రీధర్ బాబును కోరినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే, నియోజకవర్గ అభివృద్ధిలో స్థానిక వ్యాపారుల సహకారం ఎంతో బాగుందని కొనియాడారు.

​సమావేశం అనంతరం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావులను ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, మున్సిపల్ మాజీ చైర్మన్ మంగిలాల్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుండ సుధాకర్, అసోసియేషన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు