BREAKING
thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన..
Date of Publish : 08 August 2026, 09:49 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రాష్ట్రస్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్‌కు తిరువూరు విద్యార్థినులు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Aug, 2026 - 09:49 PM
77 వీక్షణలు

రాష్ట్రస్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్‌కు తిరువూరు విద్యార్థినులు

తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన పీఎం శ్రీ జిల్లా పరిషత్ హైస్కూల్ ప్లస్ విద్యార్థినులు రాష్ట్రస్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికయ్యారు. నందిగామలో నిర్వహించిన జిల్లాస్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్ క్రీడా పోటీల్లో విద్యార్థినులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు.

పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని ఎం. మయూరి వాలీబాల్ విభాగంలో, మొదటి బైపీసీ విద్యార్థిని కె. పూజిత ఖోఖో విభాగంలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

రాష్ట్రస్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, తిరువూరుకు మంచి పేరు తీసుకురావాలని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. మృదుల, హైస్కూల్ ప్లస్ ఇన్‌చార్జి కె. మోహన్‌రావు ఆకాంక్షించారు.

విద్యార్థినులకు శిక్షణ అందించిన వ్యాయామ ఉపాధ్యాయులు జి. సుకన్య, బి. జయలక్ష్మిని ప్రధానోపాధ్యాయురాలు, సిబ్బంది, విద్యార్థినులు అభినందించారు.