BREAKING
thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం thumb ● తలసాని శ్రీనివాస్ ను కలిసిన అఖిల భారత యాదవ సంఘము సభ్యులు thumb ● చిత్తూరులో వైసీపీ లీగల్ సెల్ టాస్క్‌ఫోర్స్ సమావేశం thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం thumb ● తలసాని శ్రీనివాస్ ను కలిసిన అఖిల భారత యాదవ సంఘము సభ్యులు thumb ● చిత్తూరులో వైసీపీ లీగల్ సెల్ టాస్క్‌ఫోర్స్ సమావేశం thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
Date of Publish : 24 August 2026, 09:19 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రాయచోటి జిల్లా కేంద్రం హోదాపై మరోసారి పోరాటం: గడికోట శ్రీకాంత్‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Aug, 2026 - 09:19 PM
56 వీక్షణలు

రాయచోటి జిల్లా కేంద్రం హోదాపై మరోసారి పోరాటం: గడికోట శ్రీకాంత్‌రెడ్డి

రాయచోటి జిల్లా కేంద్రం హోదా అంశంపై మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మరోసారి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాయచోటి రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటని, ఆర్థిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని ఆయన పేర్కొన్నారు.

రాయచోటిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందని భావించామని, అయితే ఎలాంటి అధికారిక ప్రక్రియ లేకుండా అంతర్గతంగా జిల్లా కేంద్రం హోదాను తొలగించారని ఆరోపించారు. ప్రజల తరఫున మరోసారి ఈ అంశంపై గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు.

రాయచోటి కేంద్రంగా జిల్లా ఏర్పాటు 2020 ఏప్రిల్ 6న జరిగిందని ఆయన గుర్తు చేశారు. రాయచోటి కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు గెజిట్ లేదని కొందరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. 2023లో ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించామని, అనంతరం కేంద్రం 2025 డిసెంబర్ 15న గెజిట్ విడుదల చేసిందని తెలిపారు.

రాయచోటి జిల్లా కేంద్రం హోదాను కొనసాగించాలని, ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.