BREAKING
thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు
Date of Publish : 01 June 2026, 08:58 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రాయలసీమలో నీళ్ల పండుగ.. సీజన్‌లో తొలిసారి పేరూరు డ్యామ్‌కు వరద నీరు

ఆంధ్రప్రదేశ్
/ శ్రీ సత్యసాయి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jun, 2026 - 08:58 PM
162 వీక్షణలు

రాయలసీమలో నీళ్ల పండుగ.. సీజన్‌లో తొలిసారి పేరూరు డ్యామ్‌కు వరద నీరు

రాయలసీమలో కురుస్తున్న వర్షాలు రైతుల్లో కొత్త ఆశలు నింపుతున్నాయి. కర్ణాటకలోని తుమకూరు ప్రాంతంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లాలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో పెన్నా నదిపై నిర్మించిన పేరూరు డ్యామ్‌కు ఈ సీజన్‌లో తొలిసారిగా వరద నీరు చేరింది.

డ్యామ్‌లోకి నీరు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ డ్యామ్ వద్దకు చేరుకుని నీటికి స్వాగతం పలికారు. కొందరు డ్యామ్‌లోకి దిగి వీడియోలు, ఫొటోలు తీసుకుంటూ తమ సంతోషాన్ని పంచుకున్నారు.

అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోని కరవు ప్రభావిత మండలాలకు పేరూరు డ్యామ్ కీలక నీటి వనరుగా ఉంది. డ్యామ్‌లోకి నీరు చేరడం వల్ల సాగునీరు, భూగర్భ జలాల పెరుగుదలకు తోడ్పాటు లభించనుండటంతో రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురిస్తే రాయలసీమలో నీటి పరిస్థితి మరింత మెరుగుపడే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.