BREAKING
thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి
Date of Publish : 25 August 2026, 04:37 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని ఏలూరు కలెక్టరేట్‌ వద్ద ధర్నా

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Aug, 2026 - 04:37 PM
53 వీక్షణలు

రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని ఏలూరు కలెక్టరేట్‌ వద్ద ధర్నా

కమీషన్ పెంచాలి.. పనిభారం తగ్గించాలి.. స్మార్ట్‌ఫోన్లు మంజూరు చేయాలి: రేషన్ డీలర్ల డిమాండ్

ఏలూరు, ఆగస్టు 25:

రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏలూరు జిల్లా రేషన్ డీలర్ల యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. కమీషన్ పెంపు, పనిభారం తగ్గింపు, స్మార్ట్‌ఫోన్ల మంజూరు వంటి డిమాండ్లతో డీలర్లు ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా జిల్లా రేషన్ డీలర్ల యూనియన్ నాయకులు రాజులపాటి గంగాధర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 వేల మంది రేషన్ డీలర్లు ప్రజలకు సేవలు అందిస్తున్నారని తెలిపారు. అయితే ప్రభుత్వం అందిస్తున్న కమీషన్ కేవలం రూ.6 వేలకే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నో సంవత్సరాలుగా రేషన్ షాపులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న డీలర్లు ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. దీనికి తోడు ప్రభుత్వం రేషన్ డీలర్లపై అదనపు పనిభారం మోపుతోందని విమర్శించారు.

బియ్యం బస్తాలను డీలర్లే దించుకోవాలని, ప్రతి బస్తాపై ఉన్న క్యూ ఆర్ కోడ్ నమోదు చేయాలని, ప్రతిరోజూ పంపిణీ చేసిన బియ్యం వివరాలతో పాటు ఖాళీ అయిన బస్తాలపై ఉన్న క్యూ ఆర్ కోడ్‌లను స్కాన్ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం వల్ల మరింత భారం పెరిగిందని గంగాధర్ పేర్కొన్నారు.

రేషన్ డీలర్లకు గౌరవ వేతనం పెంచడంతో పాటు కమీషన్‌ను పెంచాలని, అదనపు పనులను తగ్గించాలని, అవసరమైన సాంకేతిక సదుపాయాల కోసం ప్రతి డీలర్‌కు స్మార్ట్‌ఫోన్‌లు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్‌లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.