BREAKING
thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Date of Publish : 30 August 2026, 02:09 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రేషన్ మాఫియాకు చెక్....

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Aug, 2026 - 02:09 PM
85 వీక్షణలు

రేషన్ మాఫియాకు చెక్.. బియ్యం బస్తాలకు క్యూ ఆర్ కోడ్ ట్యాగ్‌లు

అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

అమరావతి: ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇకపై రేషన్ బియ్యం ప్రతి బస్తాకు క్యూ ఆర్ కోడ్ ట్యాగ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ విధానం ద్వారా అక్రమంగా పట్టుబడిన రేషన్ బస్తాలు ఏ గోదాము నుంచి వచ్చాయి, ఏ ప్రాంతానికి చెందినవి అనే వివరాలను సులభంగా గుర్తించనున్నారు.

క్యూ ఆర్ కోడ్ విధానాన్ని పౌర సరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు పరిశీలించారు. రేషన్ పంపిణీకి ముందు డీలర్లు తప్పనిసరిగా బియ్యం బస్తాలను స్కాన్ చేయాల్సి ఉంటుంది. స్కానింగ్ ద్వారా బియ్యం సరఫరా, నిల్వ, పంపిణీ వివరాలను అధికారులు పర్యవేక్షించనున్నారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ క్యూ ఆర్ కోడ్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో మరింత పారదర్శకత తీసుకురావడంతో పాటు అర్హులైన కార్డుదారులకు నాణ్యమైన బియ్యం అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సొంత జిల్లా నుంచి ఈ విధానాన్ని తొలుత అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు.