BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 30 August 2026, 03:52 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో బీజేపీ పట్టణ అధ్యక్షుడిగా వెంపాటి అబ్రాహామ్ మణిరత్నం నియామకం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Aug, 2026 - 03:52 PM
85 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు: భారతీయ జనతా పార్టీ తిరువూరు మండల అర్బన్ అధ్యక్షుడిగా వెంపాటి అబ్రాహామ్ మణిరత్నం నియమితులయ్యారు. తిరువూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ కార్యవర్గ సమావేశం అనంతరం ఈ నియామకాన్ని ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆదేశాల మేరకు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ సూచనలతో నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. తిరువూరు మండల అర్బన్ ఇన్‌చార్జి అబ్బినేని చంద్రశేఖర్ రావు (బాబు) నూతన అధ్యక్షుడు వెంపాటి అబ్రాహామ్ మణిరత్నానికి నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షురాలు పోలే శాంతి, జిల్లా కార్యవర్గ సభ్యుడు కనపర్తి నాగగోపాలకృష్ణ పాల్గొని నూతన అధ్యక్షుడికి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా పోలే శాంతి మాట్లాడుతూ పట్టణంలో బీజేపీని అంచెలంచెలుగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం నూతన అధ్యక్షుడు వెంపాటి అబ్రాహామ్ మణిరత్నాన్ని శాలువాలతో సత్కరించి, స్వీట్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో పాటు గంపలగూడెం బీజేపీ మండల అధ్యక్షురాలు వనమా సత్యవాణి, తిరువూరు మండల అధ్యక్షురాలు పగిడిపల్లి విజయలక్ష్మి, తిరువూరు పట్టణ మాజీ అధ్యక్షుడు నాగుబండి ప్రభాకర్ రావు, పట్టణ ప్రధాన కార్యదర్శి కత్తికోల రామచంద్రరావు, మాజీ జిల్లా కోశాధికారి జాలిపర్తి సుజాత, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కొంగర రామారావు, మైనార్టీ మోర్చా జిల్లా కార్యదర్శి షేక్ రాజ్ మహమ్మద్, మహిళా మోర్చా కార్యదర్శి గంధం వెంకటరమణ, ఓబీసీ మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు వడ్లపూడి సింహాచలం, మాజీ పట్టణ ప్రధాన కార్యదర్శి పొన్నూరు రామ్మోహనరావు, పట్టణ కార్యవర్గ సభ్యురాలు ఇమ్మడి ధనలక్ష్మి, ఓబీసీ మండల ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, బీఎల్ఏ-2లు తదితరులు పాల్గొన్నారు.