BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 30 August 2026, 06:08 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గంపలగూడెంలో చెరువులు అడుగంటాయి.. వర్షాల కోసం రైతుల ఎదురుచూపులు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Aug, 2026 - 06:08 PM
128 వీక్షణలు

(ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం)

వర్షాభావ పరిస్థితులు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఈ ప్రాంతానికి సాగునీరు అందకపోవడంతో గంపలగూడెం మండలంలోని చెరువులు నీరు లేక వెలవెలబోతున్నాయి. చెరువుల్లో ఉన్న కొద్దిపాటి నీటిని ఆధారంగా చేసుకుని రైతులు వరి నాట్లు వేయడంతో ప్రస్తుతం చెరువుల్లో నీటిమట్టం రోజురోజుకూ తగ్గిపోతోంది.

మండలంలోని పలు గ్రామాల్లో చెరువుల కింద ఇప్పటికీ వరి నాట్లు ప్రారంభం కాలేదు. మరికొన్ని గ్రామాల్లో వర్షాలు కురుస్తాయనే ఆశతో చెరువుల్లో నిల్వ ఉన్న నీటితో రైతులు వరి నాట్లు వేశారు. దీంతో చెరువుల్లోని నీరు వేగంగా అడుగంటుతోంది. మరో వారం, పది రోజుల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోతే మిగిలిన కొద్దిపాటి నీరు కూడా లేకుండా పోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో రెండు చెరువులు ఉండగా, శివాలయం సమీపంలోని ఒక చెరువు కింద మాత్రమే రైతులు వరి నాట్లు వేశారు. నాట్ల కోసం చెరువు నీటిని వినియోగించడంతో ఆ చెరువు కూడా ఎండిపోయే పరిస్థితికి చేరుకుందని రైతులు తెలిపారు.

వర్షాలు ఆలస్యమైతే ఇప్పటికే వేసిన వరి పంటలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సాగునీటి సమస్యపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.