BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 30 August 2026, 07:16 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు? భారీ మార్పులకు సీఎం రేవంత్ కసరత్తు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Aug, 2026 - 07:16 PM
70 వీక్షణలు

వారం, పది రోజుల్లో విస్తరణకు అవకాశం.. మంత్రుల శాఖల్లో మార్పులు, కొత్త వారికి ఛాన్స్

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరో వారం నుంచి పది రోజుల్లోగా కేబినెట్‌ విస్తరణ జరిగే అవకాశం ఉందని సమాచారం.

మంత్రివర్గ విస్తరణతో పాటు పలు కీలక మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకరిద్దరు మంత్రులపై వేటు, మరికొందరి శాఖల మార్పు, కొత్త వారికి అవకాశం కల్పించే అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

కొండా సురేఖపై చర్యలు తీసుకుంటే ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌కు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. అలాగే స్పీకర్‌ ప్రసాద్ కుమార్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటే స్పీకర్‌ పదవి ఖాళీ కానుంది. ఆ స్థానాన్ని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్‌కు అప్పగించే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మంత్రివర్గ విస్తరణతో పాటు స్పీకర్‌ మార్పు, శాఖల పునర్విభజన వంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ మార్పులపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.