BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 14 August 2026, 08:41 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రైతు నుంచి రూ.20 వేల లంచం తీసుకుంటూ వీఆర్వో ఏసీబీకి చిక్కిన వైనం

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Aug, 2026 - 08:41 PM
88 వీక్షణలు

రైతు నుంచి రూ.20 వేల లంచం తీసుకుంటూ వీఆర్వో ఏసీబీకి చిక్కిన వైనం

గంగవరం గ్రామ సచివాలయంలో ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులు

మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలంలో ఘటన

మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం గంగవరం గ్రామ సచివాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. రైతు నుంచి లంచం తీసుకుంటున్న వీఆర్వో మహబూబ్ భాషను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం.

రైతుకు సంబంధించిన పనిని పూర్తి చేసేందుకు వీఆర్వో రూ.20 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు అందడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. పక్కా ప్రణాళికతో గంగవరం గ్రామ సచివాలయానికి చేరుకున్న అధికారులు, లంచం సొమ్ము తీసుకుంటున్న సమయంలో వీఆర్వోను పట్టుకున్నట్లు తెలిసింది.

ఏసీబీ అధికారులు లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకుని, ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. వీఆర్వో మహబూబ్ భాషపై కేసు నమోదు చేసి తదుపరి చర్యల ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు సమాచారం.

ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి తావులేకుండా చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు పలుమార్లు హెచ్చరిస్తున్నప్పటికీ, కొందరు ఉద్యోగులు లంచాలకు పాల్పడుతూ పట్టుబడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.