BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 13 September 2026, 11:48 pm
Posted by : గంగుల రాజ్ కుమార్

గ్రీన్‌ఫీల్డ్ హైవే కోసం భూములు కోల్పోతున్న రైతులకు ఎమ్మెల్యే భరోసా

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
13 Sep, 2026 - 11:48 PM
53 వీక్షణలు

తమ భూములు తీసుకోవద్దంటూ ప్రేమ్ సాగర్ రావును కలిసిన 150 మంది రైతులు

మంచిర్యాల | Ntoday News

మంచిర్యాల నియోజకవర్గంలోని లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాలకు చెందిన సుమారు 150 మంది రైతులు ఎన్‌హెచ్‌-63 గ్రీన్‌ఫీల్డ్ హైవే కోసం భూముల సేకరణ అంశంపై ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును కలిశారు. తమ భూములను హైవే కోసం తీసుకోవద్దని రైతులు విజ్ఞప్తి చేశారు.

గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు కోల్పోయామని, ప్రస్తుతం తమ వద్ద మిగిలిన కొద్దిపాటి భూమి కూడా గ్రీన్‌ఫీల్డ్ హైవే కోసం తీసుకుంటే జీవనోపాధి కోల్పోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భూముల సేకరణకు సంబంధించి అధికారులు నోటీసులు జారీ చేస్తున్న నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని కోరారు.

రైతుల సమస్యలపై స్పందించిన ప్రేమ్ సాగర్ రావు వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రైతులకు ఇబ్బందులు కలిగించేలా చర్యలు తీసుకోవద్దని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. నోటీసుల విషయంలో తొందరపడవద్దని, ప్రతి గ్రామంలో గ్రామసభలు నిర్వహించి రైతుల అభిప్రాయాలను తెలుసుకోవాలని అధికారులను సూచించారు.

ప్రతి గ్రామసభకు తాను కూడా హాజరవుతానని ఎమ్మెల్యే తెలిపారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులతో కలిసి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

కాగా, అరమూర్–జగిత్యాల–మంచిర్యాల ఎన్‌హెచ్‌-63లోని పలు భాగాలను నాలుగు లేన్లుగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2026లో ఆమోదం తెలిపింది. మంచిర్యాల–జగిత్యాల సెక్షన్‌లో 66.10 కిలోమీటర్లు గ్రీన్‌ఫీల్డ్ మార్గంగా ఉండనుంది. 

ఇదిలా ఉండగా, మంచిర్యాల జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ హైవే కోసం భూములు కోల్పోతున్న రైతులు గతంలోనూ తమ ఆందోళనలను వ్యక్తం చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు తర్వాత మరోసారి భూములు కోల్పోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేసినట్లు సెప్టెంబర్ 9న నివేదికలు వెలువడ్డాయి.