BREAKING
thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్
Date of Publish : 01 May 2026, 12:18 pm
Posted by : V శ్రీనివాస్

రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి: నడిపెల్లి విజిత్ కుమార్

తెలంగాణ
/ మంచిర్యాల / హాజీపూర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
01 May, 2026 - 12:18 PM
179 వీక్షణలు

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ సకాలంలో జరగకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు 

మంచిర్యాల/హాజీపూర్:

మంచిర్యాల నియోజకవర్గంలోని రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం వెంటనే గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం హాజీపూర్ మండలం, పెద్దంపేట గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి, అక్కడ పేరుకుపోయిన ధాన్యపు రాశులను పరిశీలించి రైతులతో మాట్లాడారు.

​ఈ సందర్భంగా విజిత్ కుమార్ గారు మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు:

​తీరని ఇబ్బందులు: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ సకాలంలో జరగకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

​అకాల వర్షాల భయం: ఆకాశం మేఘావృతమై అకాల వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో, ధాన్యం తడిసిపోకుండా రైతులు సొంతంగా టార్పాలిన్ కవర్లు కొనుగోలు చేసుకుని కాపాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

​ప్రభుత్వానికి హెచ్చరిక: వెంటనే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.

​ఈ కార్యక్రమంలో పెద్దంపేట గ్రామ సర్పంచ్ జాడి వెంకటేష్, పార్టీ నాయకులు మొగిలి శ్రీనివాస్, మాధవరపు జీవన్ రావు, వంశీ గౌడ్ మరియు ఇతర ముఖ్య నాయకులు, రైతులు పాల్గొన్నారు.