BREAKING
thumb వైసీపీని వీడి టీడీపీలో చేరిన 26వ వార్డు ముస్లిం మైనార్టీ కుటుంబాలు thumb తెలంగాణ రైతంగా సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించే హక్కు బీజేపీకి ఎక్కడిది? thumb నాగార్జున కుటుంబానికి అండగా ఉంటాం.. భూమా అఖిలప్రియ thumb ప్రథమ నందీశ్వర ఆలయ మార్గంలో బ్రిడ్జి దెబ్బతినడంతో భక్తులకు ఇబ్బందులు thumb బత్తలూరులో రాముల వారి ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా అన్నదానం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb వైసీపీని వీడి టీడీపీలో చేరిన 26వ వార్డు ముస్లిం మైనార్టీ కుటుంబాలు thumb తెలంగాణ రైతంగా సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించే హక్కు బీజేపీకి ఎక్కడిది? thumb నాగార్జున కుటుంబానికి అండగా ఉంటాం.. భూమా అఖిలప్రియ thumb ప్రథమ నందీశ్వర ఆలయ మార్గంలో బ్రిడ్జి దెబ్బతినడంతో భక్తులకు ఇబ్బందులు thumb బత్తలూరులో రాముల వారి ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా అన్నదానం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు
Date of Publish : 06 August 2026, 06:12 pm
Posted by : THUNIKI NAGARAJU

రౌడీ, హిస్టరీ షీటర్ల పై నిరంతర నిఘా ఉంచాలి – జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్....

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
Thuniki Nagaraju రాయికల్ మండల ప్రతినిధి
06 Aug, 2026 - 06:12 PM
130 వీక్షణలు

రౌడీ, హిస్టరీ షీటర్ల పై నిరంతర నిఘా ఉంచాలి – జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్....

  • ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు.
  • రౌడీ, హిస్టరీ, సస్పెక్ట్ షీట్ల నిర్వహణ పై సమీక్ష....

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ఎలాంటి విఘాతం కలగకుండా రౌడీ షీట్లు, హిస్టరీ షీట్లలో ఉన్న వ్యక్తులపై నిరంతర నిఘా కొనసాగించాలని జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్, ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. గురువారం  జిల్లా పోలీస్ కార్యాలయంలో రౌడీ, హిస్టరీ, సస్పెక్ట్ షీట్ల నిర్వహణ, తరుచూ నేరాలకు పాల్పడే వ్యక్తులపై తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రౌడీ షీట్లు, హిస్టరీ షీట్లలో ఉన్న వ్యక్తుల ప్రవర్తన, కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశమున్న వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అవసరమైన సందర్భాల్లో బైండోవర్ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పాత నేరస్థులు తిరిగి నేరాలకు పాల్పడకుండా వారిపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని అన్నారు. రౌడీ,హిస్టరీ అనుమానాస్పద,అల్లర్లు లో ప్రమేయం ఉన్నవారిని ప్రతి నెల పోలీస్ స్టేషన్ కు పిలిపించి వివరాలు తీసుకోవాలని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపడం జరుగుతుందని శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.